ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్ 2’ (Avatar 2) సినిమా ఈ నెల 16న థియేటర్లలోకి వచ్చింది. హాలీవుడ్ దిగ్దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) రూపొందించిన ఈ మూవీ మార్నింగ్ షోతోనే సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా టెక్నాలజీ పరంగా వరల్డ్ సినిమాను ముందుకు తీసుకెళ్లేలా ‘అవతార్ 2’ను కామెరూన్ తెరకెక్కించారు. భారీ అంచనాలతో బిగ్ స్క్రీన్స్‌లోకి వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.
2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదలైన ‘అవతార్ 2’ తెలుగు వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజునే ఈ మూవీ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. రిలీజైన మూడ్రోజుల్లో రూ.38 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ జేమ్స్ కామెరూన్ మూవీ.. ఐదో రోజుతో రూ.47 కోట్ల వసూళ్లను సాధించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ రానుండటంతో ‘అవతార్ 2’ లాంగ్ రన్‌కు ఢోకా కనిపించడం లేదు. తెలుగు వెర్షన్ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.60 కోట్ల క్లబ్‌లోకి చేరడం సులువేనని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
‘అవతార్ 2’ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఓ హాలీవుడ్ మూవీకి ఒక స్టార్ హీరో స్థాయిలో ఆదరణ దక్కడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకూ ఏ ఇంగ్లీష్ సినిమాకు రానంత స్థాయిలో ‘అవతార్ 2’ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ కొల్లగొడుతుండటం అందర్నీ ఆలోచింపజేస్తోంది. తెలుగు ప్రేక్షకులు బిగ్ కాన్వాస్ మూవీస్, క్వాలిటీ ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది నిరూపిస్తోందని అంటున్నారు. ‘అవతార్ 2’, ‘కాంతార’, ‘విక్రమ్’ లాంటి సినిమాల సక్సెస్‌ను బట్టి.. మన ఆడియెన్స్ క్వాలిటీ కంటెంట్‌తో వచ్చే సినిమాలు ఏ భాషవనేది పట్టించుకోరని మరోసారి నిరూపిస్తోందని చెబుతున్నారు. తెలుగు ఫిలిం మేకర్స్ కూడా క్వాలిటీ కంటెంట్‌తో సినిమాలు తీయడంపై దృష్టి సారించాలని ట్రేడ్ విశ్లేషకులతోపాటు మూవీ లవర్స్ సూచిస్తున్నారు.
Read more: Cine Celebs : రమేష్‌బాబు నుంచి కృష్ణ వరకు 2022లో మరణించిన సినీ సెలబ్రిటీలు
Follow Us