సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) : కీర్తి సురేష్‌ను ర్యాగ్ చేసిన సుమ

Published on May 11, 2022 04:04 PM IST

సర్కారు వారి పాట.. ఇటీవలి కాలంలో ఈ సినిమా పేరు బాగా హల్చల్ చేస్తోంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత, ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇటీవలే జరిగిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్రీరిలీజ్ వేడుకలో ఇదే విషయాన్ని నటి కీర్తి సురేష్ ప్రేక్షకులతో పంచుకున్నారు. 

కీర్తి సురేష్‌ను తొలుత యాంకర్ సుమ డ్యాన్స్ చేయమని కోరగా.. ఆమె "ఏంటీ.. నన్ను మీరు ర్యాగింగ్ చేస్తున్నారా?" అని నవ్వుతూ అడిగారు. తర్వాత వేదికపై డ్యాన్స్ చేయడానికి, తన డ్రెస్ సహకరించదని తెలిపారు. ఆ తర్వాత అభిమానులతో మాట్లాడారు. తాను పోషించిన కళావతి అనే పాత్ర, అందరికీ తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. 

ఇక కథానాయకుడు మహేష్ బాబు గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ "ఆయనతో వర్క్ చేయడం అంటేనే ఓ పెద్ద టెన్షన్. ముఖ్యంగా ఆయన టైమింగ్‌ను మ్యాచ్ చేయగలనో లేదో అనే టెన్షన్‌తోనే సినిమా చేశాను. అలాగే ఆయన గ్లామర్‌ను మ్యాచ్ చేయగలనా లేదా? అనే సంశయంతో కూడా నటించాను. ఇప్పుడు ఆయన అభిమానులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో తెలియని టెన్షన్‌కి గురవుతున్నాను" అని తన మనసులోని మాటలను బయటపెట్టారు కీర్తి సురేష్.