షాపింగ్ మాల్ (CMR Shopping Mall) ప్రారంభోత్సవంలో కీర్తి సురేష్ (Keerthy Suresh).. మహానటి సందడి మామూలుగా లేదుగా

Published on Sep 16, 2022 12:51 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా (Mahanati Movie) పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్ (Keerthy Suresh). అందులో కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఈమె నటన చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. 

తాజాగా మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) సినిమాలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు కీర్తి సురేష్ కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ (Keerthy Suresh) గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ పున:ప్రారంభోత్సవానికి హాజరై సందడి చేశారు. మార్కెట్ లో ఎక్కడా దొరకని విధంగా అతి తక్కువ ధరలకు, నాణ్యతకు మారుపేరుగా నిలిచేలా షాపింగ్ మాల్ ను ప్రారంభింపజేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత అల్లక సత్యనారాయణ, వారి బృందం ఆహ్వానం మేరకు జిల్లా కేంద్రానికి వచ్చిన కీర్తి సురేష్ జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

సీఎంఆర్ షాపింగ్ మాల్ (CMR Shopping Mall) పున:ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అభిమాన జనానికి ఉత్సాహాన్నిచ్చేలా కీర్తి సురేష్ అభివాదం చేయడంతో పాటు.. మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. కాగా, సాయంత్రం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు సీఎంఆర్ షాపింగ్ మాల్ ను సందర్శించి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. 

కాగా, కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇటీవల ఓ ఎయిర్ పోర్టులో కనిపించింది. అయితే ఆమె టైట్ ఫిట్ డ్రెస్ లో ఎద అందాలు కుర్రాళ్లకు మత్తెక్కించాయి. ఒక స్టార్ హీరోయిన్ ఇలా కనిపిస్తే.. కెమెరా కళ్లు ఆగుతాయా..? వెంటనే కుర్రాళ్ల కళ్లతో పాటు.. కెమెరాలు కూడా కీర్తిపైనే ఫోకస్ చేశాయి. ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Read More: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త ఆలోచనలు.. 'మహానటి' హిట్ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకే తొలి ప్రాధాన్యం !