02 : నయనతార నటనా వైదుష్యాన్ని చాటే, మరో గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ !

Updated on May 22, 2022 01:22 PM IST
న‌య‌న‌తార న‌టించిన‌  O2 సినిమా టీజ‌ర్ రిలీజ్
న‌య‌న‌తార న‌టించిన‌  O2 సినిమా టీజ‌ర్ రిలీజ్

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార (Nayanthara) సౌత్‌లో ఇర‌గ‌దీస్తున్నారు. వ‌రుస సినిమాల‌తో ఆమె ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం  మరో సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో కూడా న‌టిస్తున్నారు. ఇటీవలే ఓ వైవిధ్యమైన పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించిన‌  O2 సినిమా టీజ‌ర్‌ను నిర్మాతలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో,  హీరోయిన్ ఓరియెంటడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు న‌య‌న‌తార‌.

ఓ వైపు ల‌వ్, ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే.. థ్రిల్ల‌ర్, యాక్ష‌న్ చిత్రాల  మీద కూడా ఫోక‌స్ పెట్టారు. క‌ర్త‌వ్యం, మ‌యూరి, కోకో కోకిల సినిమాలు అందుకు ఉదాహరణ. ఇవన్నీ న‌య‌న‌తార సింగిల్‌గా హ్యాండిల్ చేసిన‌వే.

న‌య‌న‌తార కొత్త సినిమా  O2 టీజ‌ర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమా టైటిల్ ఓ సందేశాన్ని చెప్పకనే చెబుతోంది. మ‌నిషి బ‌త‌క‌డానికి ఆక్సిజ‌న్ అవ‌స‌రం అని ఈ టైటిల్ ద్వారా మేకర్స్ తెలపడం గమనార్హం.  

ఈ సినిమా కథ కూడా చాలా వినూత్నంగా ఉండడం విశేషం. నయనతార, ఇతర ప్రయాణికులు కలిసి ఓ బస్సులో కొచ్చికి వెళ‌తారు. ఆ బస్సు అనుకోకుండా లోయలో పడిపోతుంది. ఈ క్రమంలో ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశారనే నేప‌థ్యంలో, ఈ సినిమా క‌థ సాగుతుంది. 

O2 సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం లేదు. నిర్మాతలు ఈ చిత్రాన్ని, ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.  ప్ర‌ముఖ  ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో O2 త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఇక‌ నయ‌న‌తార న‌టించిన 'క‌తువాకుల రెండు కాద‌ల్' సినిమా మంచి హిట్ సాధించింది. ప్ర‌స్తుతం నయనతార, చిరంజీవి కాంబినేషనులో  'గాడ్ ఫాద‌ర్‌' చిత్రం తెరకెక్కుతోంది. మ‌రోప‌క్క న‌య‌నతార‌ తన ప్రియుడు విష్నేష్ శివ‌న్‌తో పెళ్లికి రెడీ కూడా అవుతోంది.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!