ఎదుటి వారికి న‌చ్చేలా ఎందుకుండాలి?: శృతిహాస‌న్(Shruti Haasan)

Updated on May 13, 2022 09:05 PM IST
తెలుగులో త‌క్కువ సినిమాలే చేసిన పాపుర‌ల్ హీరోయిన్ అయ్యారు శృతిహాస‌న్(Shruti Haasan). త‌న వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో ఓ ఇంట‌ర్వ్యూలో శృతిహాస‌న్ చెప్పారు.
తెలుగులో త‌క్కువ సినిమాలే చేసిన పాపుర‌ల్ హీరోయిన్ అయ్యారు శృతిహాస‌న్(Shruti Haasan). త‌న వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో ఓ ఇంట‌ర్వ్యూలో శృతిహాస‌న్ చెప్పారు.

తెలుగులో త‌క్కువ సినిమాలే చేసిన పాపుర‌ల్ హీరోయిన్ అయ్యారు శృతిహాస‌న్(Shruti Haasan). త‌న వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో ఓ ఇంట‌ర్వ్యూలో శృతిహాస‌న్ చెప్పారు. శృతిహాస‌న్ ఎదుటివాళ్ల‌కు న‌చ్చేలా ఉండ‌వ‌స‌రం లేదంటూ కామెంట్స్ చేశారు. 

సౌత్ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా శృతిహాస‌న్(Shruti Haasan) బిజీ అయ్యారు. త‌క్కువ సినిమాలే చేస్తున్నా.. సెల‌క్టీవ్ క‌థ‌ల‌ను ఎంచుకుంటంది. మ్యూజిక్ వీడియోస్ చేసే హీరోయిన్ కూడా శృతిహాస‌నే. చిరంజీవికి జోడిగా ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు శృతిహాస‌న్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి సినిమా కోసం హైదరాబాద్ వచ్చింది శృతిహాసన్.

చిరంజీవి సినిమాతో పాటు ప్ర‌భాస్ సినిమా స‌లార్ కూడా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న స‌లార్ శృతి రేంజ్ పెంచుతుందని అభిమానులు అంటున్నారు. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత తిరిగి ముంబయి వెళ్ల‌నుంది శృతిహాస‌న్.

Shruti Haasan

ఓ ఇంట‌ర్వ్యూలో శృతిహాస‌న్ త‌న వ్య‌క్తిత్వం గురించి చెప్పింది. తాను ఒకప్పుడు ఎదుటివారికి న‌చ్చేలా ఉండాల‌ని ప్ర‌య‌త్నించేదాన్ని అని.. అలా చేయ‌డం వ‌ల్ల స్నేహితుల‌ను కోల్పోయాన‌ని చెప్పింది. ఆ త‌ర్వాత తన‌లా తాను ఉండ‌టం.. త‌న‌కు న‌చ్చింది చేయ‌డంతో తానేంటో త‌న‌కు తెలిసింద‌న్నారు. 

అంద‌రితోనూ ఒకేలా ఉంటాన‌ని శృతిహాస‌న్(Shruti Haasan) అన్నారు. కొంత‌మంది త‌న‌ను ఇష్ట‌ప‌డ‌తారు.. మ‌రి కొంద‌రికి తాను న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని.. అయినా తాను త‌న‌కు న‌చ్చిన‌ట్టే ఉంటాట‌న‌ని శృతిహాస‌న్ అన్నారు. ఎదుటి వారికి న‌చ్చిన‌ట్టు మాత్రం బ్ర‌త‌కాల‌ని మాత్రం అనుకోవ‌ద్దంటూ శృతి హాస‌న్ ఇన్ డైరెక్ట్‌గా త‌న‌ను ఇబ్బందికి గురి చేసిన వారిపై కామెంట్స్ చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!