షిర్డీలో న‌య‌నతార‌(Nayantara)తో దిగిన ఫోటోలు షేర్ చేసిన విగ్నేష్ 

Updated on May 06, 2022 06:14 PM IST
లేడీ సూప‌ర్ స్టార్‌గా న‌య‌న‌తార(Nayantara) సౌత్ ఇండియ‌న్ సినిమాలు చేస్తున్నారు. ప్రియుడు విగ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కాత్తు వాక్కుల రెండు కాద‌ల్ సినిమాలో న‌య‌న‌తార న‌టించారు. 

పేరుతోనే  తారగా మారిన హీరోయిన్ న‌య‌న‌తార(Nayantara) ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించారు. రీసెంట్‌గా విడుద‌లైన త‌మిళ్ మూవీ కాత్తు వాక్కుల రెండు కాద‌ల్ సూప‌ర్ హిట్ అయింది. న‌య‌న‌తార‌, త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్ క‌లిసి దైవ ద‌ర్శ‌నాలు చేస్తున్నారు. షిర్డీలో బాబా దర్శనం అనంతరం ఆలయంలో ఫోటోలు దిగారు. విగ్నేష్ త‌న ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేశారు త‌న క‌న్మ‌నీ(ల‌వ‌ర్) న‌య‌న‌తార‌తో క‌లిసి బాబా ద‌ర్శ‌నం చేసుకోవ‌డం అదృష్ణంగా ఫీల్ అవుతున్నాన‌ని విగ్నేష్ పోస్ట్‌లో తెలిపారు.

కొద్ది రోజుల క్రితం న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత షిర్డీ బాబా ఆల‌యాన్ని సంద‌ర్శించారు.  విగ్నేష్ శివన్ దర్శకత్వంలో న‌య‌న‌తార చేసిన త‌మిళ్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్రేకులు లేకుండా దూసుకెళుతుంది. వీరి ప్రేమ కూడా బ్రేక్ కాకుండా ఉండేందుకు దేవుడ్ని వేడుకుంటున్నారంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.  కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలో న‌య‌న‌తార‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, స‌మంతలు న‌టించారు. కామెడీ, ల‌వ్ ట్రాక్ సినిమాగా కాత్తు వాక్కుల రెండు కాద‌ల్ ప్రేక్ష‌కులకు వినోదం పంచుతుంది. 

కొన్నేళ్ల నుంచి న‌య‌న‌తార‌(Nayantara), విగ్నేష్ ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు ఈ జంట ఎంగేజ్మెంట్ రింగులతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ర‌హ‌స్యంగా పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ అవ‌న్నీ ఫేక్  అని.. పెళ్లి  ఎప్పుడు చేసుకుంటామో  చెబుతామ‌న్నారు న‌య‌న‌తార‌, విగ్నేష్‌లు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!