ప్రేమతో పెళ్లిపీటలెక్కుతున్న నయనతార (Nayanthara).. ఎప్పుడంటే..
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) దర్శకుడు విగ్నేష్ శివన్‌ల పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. జూన్ 9న విగ్నేష్, నయన్ ఒకటి కాకున్నారు. ప్రేమతో పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.
హీరోయిన్ నయనతార(Nayanthara) దర్శకుడు విగ్నేష్‌ల ప్రేమ బందం పెళ్లిగా మారనుంది. లవ్ ఫెల్యూర్‌ను తట్టుకుని నయనతార సినిమాలపై పోకస్ చేశారు. కొన్నేళ్ల నుంచి నయనతార(Nayantara), విగ్నేష్ ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు ఈ జంట ఎంగేజ్మెంట్ రింగులతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని.. పెళ్లి కబురు చెబుతామన్నారు.
రీసెంట్‌గా విడుదలైన నయనతార తమిళ్ మూవీ కాత్తు వాక్కుల రెండు కాదల్ సూపర్ హిట్ అయింది. నయనతార, తన ప్రియుడు విగ్నేష్ శివన్ కలిసి దైవ దర్శనాలు చేస్తున్నారు.విగ్నేష్ తన ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేశారు తన కన్మనీ(లవర్) నయనతార(Nayanthara)తో కలిసి బాబా దర్శనం చేసుకోవడం అదృష్ణంగా ఫీల్ అవుతున్నానని విగ్నేష్ పోస్ట్‌లో తెలిపారు.
కొద్ది రోజుల క్రితం నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత షిర్డీ బాబా ఆలయాన్ని సందర్శించారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార చేసిన తమిళ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేకులు లేకుండా దూసుకెళుతుంది. వీరి ప్రేమ కూడా బ్రేక్ కాకుండా ఉండేందుకు దేవుడ్ని వేడుకుంటున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలో నయనతారతో పాటు విజయ్ సేతుపతి, సమంతలు నటించారు. కామెడీ, లవ్ ట్రాక్ సినిమాగా కాత్తు వాక్కుల రెండు కాదల్ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది.
నానుమ్ రౌడీ తాన్ సినిమాతో నయనతార (Nayanthara), విగ్నేష్‌ల మధ్య ప్రేమ చిగురించింది. విగ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జరిగిపోయింది. ఇక జూన్ 9న నయనతార తను ప్రేమించిన విగ్నేష్‌ను పెళ్లి చేసుకోకున్నారు.