Anayas Tutorial: ‘అన్యా’స్‌ ట్యుటోరియల్‌’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి..!

Published on Jun 21, 2022 04:12 PM IST

ప్రస్తుతం ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ దిగ్గజ సంస్థలన్నీ సినిమాలకు ధీటుగా బలమైన కంటెంట్ తో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. తెలుగులో తొలి ఓటీటీ అయిన ఆహా (Aha OTT) నుంచి కూడా అనేక వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ కి రంగం సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'అన్యాస్‌ ట్యుటోరియల్‌' ట్రైలర్‌ను లాంచ్ చేశాడు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఈ మధ్యే ఈ సిరీస్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ట్రైలర్‌తో మరింత భయపెట్టారు ఈ సిరీస్‌ మేకర్స్‌. 

రెజీనా, నివేదితా సతీష్‌ ముఖ్య తారలుగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘అన్యా’స్‌ ట్యుటోరియల్‌’ (Anayas Tutorial). హర్రర్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. రెజీనా, నివేదిత ఈసిరీస్ లో అక్కా చెల్లెల్లు గా నటించారు. సైబర్ టచ్ తో సాగే ఈ సిరీస్ లో హర్రర్ సన్నివేశాలు భయంకరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. హార్రర్ చిత్రాల ప్రియులకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది అని అంటున్నారు. అక్కా చెల్లెళ్ళ మధ్య ఎం జరిగింది ? సైబర్ ప్రపంచం లోకి హర్రర్ ఎలా వచ్చింది అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఆర్కా  మీడియా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ హర్రర్ చూపించాలంటే కష్టం. కానీ అందరికీ ఇదే నచ్చుతుంది. ఈ కథ వినగానే వెబ్ సిరీస్ రూపంలో చిత్రీకరించాలని అనుకున్నట్లు శోభు తెలిపారు. 

ఆర్కా మీడియా, ఆహా నిర్మించిన ఈ సిరీస్‌ జూలై 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమౌళి (SS Rajamouli). ‘‘అన్యా’స్‌ ట్యుటోరియల్‌’ కథను నిర్మాత అల్లు అరవింద్‌గారికి చెప్పాను. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ చెప్పాను. ‘మొదటిసారి నువ్వు చెప్పిన సీన్‌ ఎందుకు తీసేశావు? అని అడిగారు’. ఎన్నో కథలు వినే ఆయన ఓ చిన్న సీన్‌ను ఎలా గుర్తుపెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వేసింది. ఇదే ఆయన సక్సెస్‌కు ఓ సీక్రెట్‌ కావొచ్చు’’ అన్నారు పల్లవి గంగిరెడ్డి. ‘‘ఆహా’ టీమ్‌తో కలిసి ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు శోభు యార్లగడ్డ. 

Read More: ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమా డైరెక్టర్ రాజమౌళిని (Rajamouli) పొగడ్తలతో ముంచెత్తిన హాలీవుడ్‌ నటుడు