థమన్ (Thaman) సంగీతానికి ఓ బ‌హుమ‌తి: అనంత శ్రీరామ్

Updated on Apr 26, 2022 11:15 AM IST
పాట‌కు కాదు ఆట‌కు సై అంటున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్. క‌మాన్ క‌ళావ‌తి పాట ర‌చ‌యిత అనంత శ్రీరామ్ క‌మాన్ థ‌మ‌న్(S.Thaman) అంటున్నారు. అనంత శ్రీరామ్ ఎందుక‌లా అంటున్నారు?.
పాట‌కు కాదు ఆట‌కు సై అంటున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్. క‌మాన్ క‌ళావ‌తి పాట ర‌చ‌యిత అనంత శ్రీరామ్ క‌మాన్ థ‌మ‌న్(S.Thaman) అంటున్నారు. అనంత శ్రీరామ్ ఎందుక‌లా అంటున్నారు?.

పాట‌కు కాదు ఆట‌కు సై అంటున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్. క‌మాన్ క‌ళావ‌తి పాట ర‌చ‌యిత అనంత శ్రీరామ్ క‌మాన్ థ‌మ‌న్(Thaman) అంటున్నారు. అనంత శ్రీరామ్ ఎందుక‌లా అంటున్నారు?.


 

S.Thaman

అనంత శ్రీరామ్ (Anantha Sriram) పాట‌ల ర‌చ‌యిత‌గా ఎన్నో వంద‌ల పాట‌లు రాశారు. యూత్, మాస్, క్లాసిక‌ల్ సాంగ్స్ లిరిక్స్ స్పెష‌లిస్ట్ శ్రీరామ్. ప్ర‌స్తుతం అనంత శ్రీరామ్ స‌ర్కారు వారి పాట సినిమాకు రాసిన‌ 'క‌మాన్ క‌మాన్ క‌ళావ‌తి'... పాట సూప‌ర్ హిట్‌తో చెల‌రేగిపోతుంది. అనంత శ్రీరామ్ రాసిన 'క‌ళావ‌తి' పాట లిరిక్స్‌కు మ్యాజిక్ లాంటి మ్యూజిక్ అందించారు థ‌మ‌న్(S.Thaman),

త‌న‌కు ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుల్లో థ‌మ‌న్ ఒక‌ర‌ని అనంత శ్రీరామ్ చెప్తుంటారు. ఇష్ట‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కోసం అనంత శ్రీరామ్ గిఫ్ట్ తీసుకున్నానంటూ తెలిపారు. థ‌మ‌న్‌కు క‌శ్మీర్ నుంచి మ‌రీ క్రికెట్ బ్యాట్ తెస్తున్నార‌న్నారు. కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న క్రికెట్ బ్యాట్ ఫ్యాక్ట‌రీలో ప్ర‌త్యేకంగా చేయించార‌ట‌. ల‌వ్ లీ గిఫ్ట్ త‌న‌కు ఇష్ట‌మైన థ‌మ‌న్ కోస‌మంటూ అనంత శ్రీరామ్ చెప్పారు.


అనంత శ్రీరామ్ గిఫ్ట్ చూసిన థ‌మ‌న్ చాలా ఖుషీ ఫీల్ అయ్యారు. అంతే కాంకుండా స‌ర్కారు వారి పాట సినిమా నుంచి మ‌రో హిట్ సాంగ్ విడుద‌ల‌కు శ్రీరామ్ త్వ‌ర‌గా రావాలంటూ ట్వీట్ చేశారు. మ‌హేష్ బాబు,కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట మే 12 రిలీజ్ కానుంది. క‌ళావ‌తి పాట‌లానే ఇంకెన్ని సూప‌ర్ హిట్ సాంగ్స్ ఉన్నాయోన‌ని ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!