చిత్ర పరిశ్రమకు నువ్వు వీరప్పన్ లాంటోడివి.. ప్రశాంత్‌నీల్‌పై రాంగోపాల్‌ వర్మ (RGV) కామెంట్లు

Updated on May 05, 2022 05:36 PM IST
కేజీఎఫ్‌ డైరెక్టర్‌‌ ప్రశాంత్‌ నీల్, రాంగోపాల్ వర్మ  (RGV)
కేజీఎఫ్‌ డైరెక్టర్‌‌ ప్రశాంత్‌ నీల్, రాంగోపాల్ వర్మ (RGV)

కేజీఎఫ్‌ సినిమాతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్‌నీల్‌. ప్రేక్షకులను మెప్పించి మోస్ట్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌‌గా పేరుతెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా చిత్రపరిశ్రమలోని అందరూ ప్రశాంత్‌నీల్‌ గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (RGV) కూడా ప్రశాంత్‌నీల్‌పై కామెంట్లు చేశాడు.

ప్రశాంత్‌నీల్‌.. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివి. కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ ఇండస్ట్రీతోపాటు టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్‌లోని ప్రతి డైరెక్టర్‌‌ మనసులోనూ చోటు దక్కించుకున్నావు. నీకు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు. కేజీఎఫ్ సినిమా ఎందుకు అంతటి ఘన విజయం సాధించిందో, క్రేజ్‌ దక్కించుకుందో తెలియక చాలా మంది తమ సినిమాలను రీ షూట్‌, రీ డ్రాఫ్ట్ చేసుకునే పనిలో పడ్డారు. భారీగా డబ్బును వృథా చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో 95 శాతం మందికి కేజీఎఫ్ 2 నచ్చలేదు. పాత సినీ పరిశ్రమను బయటకు తోసేసి, కొత్త ఇండస్ట్రీకి నువ్వు నాంది పలికావని అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఆ కొత్త ఇండస్ట్రీ పేరే కేజీఎఫ్‌2 అని కేజీఎఫ్‌ డైరెక్టర్‌‌ ప్రశాంత్‌నీల్‌ను పొగుడుతూ వర్మ ట్వీట్‌ చేశాడు.

కేజీఎఫ్‌ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్‌ నీల్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్‌‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కేజీఎఫ్‌ సక్సెస్‌తో తన బాధ్యత మరింతగా పెరిగిందని, సలార్‌‌ సినిమాను మరింత బాగా తీస్తానని అంటున్నాడు ప్రశాంత్. ఈ నేపథ్యంలో సలార్‌‌ ఇంటర్వెల్‌లో వచ్చే ప్రీ క్లైమాక్స్‌ను బాలీవుడ్‌ తరహాలో తెరకెక్కించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్,

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!