అభిమానులతో సెల్ఫీ దిగిన పూజా హెగ్డే (Pooja Hegde)

Published on Apr 26, 2022 08:26 PM IST

అభిమానులతో సెల్ఫీ దిగిన పూజా హెగ్డే (Pooja Hegde)

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసుకుంటూ, దూసుకెళ్లిపోతున్న తార ఎవరైనా ఉన్నారంటే.. ఆమె పూజా హెగ్డే మాత్రమే. గద్దలకొండ గణేష్, అల వైకుంఠాపురంలో, మహర్షి, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, బీస్ట్.. ఇప్పుడు ఆచార్య. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె నటించిన లిస్ట్ పెద్దదే ఉంది. 

ఆచార్య తర్వాత పూజా హెగ్డే ఎఫ్ 3 సినిమాకి సైన్ చేయడంతో పాటు, సర్కస్ పేరుతో నిర్మితమవుతున్న మరో హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోయే మరో సినిమాలో కూడా కథానాయికగా నటించబోతోంది. ఇటీవలే ఆచార్య ప్రిరిలీజ్ వేడుకలకు హాజరైన పూజా ఫోటోగ్రాఫర్లకు ఫోజులివ్వడమే కాకుండా.. తన అభిమానులతో సెల్ఫీలు కూడా దిగింది.