'అలయ్ బలయ్' (Alai Balai) కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బండారు దత్తాత్రేయ!

Published on Oct 06, 2022 06:55 PM IST

హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 'అలయ్ బలయ్' (Alai Balai) కార్యక్రమానికి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

'అలయ్ బలయ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, బండారు దత్తాత్రేయ (Megastar Chiranjeevi, Bandaru Dattatreya at Alai Balai) మెగాస్టార్ చిరంజీవితో (Megastar Chiranjeevi) పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో దత్తాత్రేయ, చిరంజీవి డప్పు కొడుతూ అందరినీ ఉత్సాహపరిచారు.

బండారు దత్తాత్రేయ గారు(Megastar Chiranjeevi, Bandaru Dattatreya at Alai Balai) 'అలయ్ బలయ్' (Alai Balai) లాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. గవర్నర్ దత్తాత్రేయ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని.. దీనికి ఆయన విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారని చిరంజీవి కొనియాడారు

'అలయ్ బలయ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, బండారు దత్తాత్రేయ (Megastar Chiranjeevi, Bandaru Dattatreya at Alai Balai) ఈ కార్యక్రమానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని.. గతంలో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), అల్లు అరవింద్‌కు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. సాధారణంగా విద్య, వైద్యం, వైజ్ఞానిక కార్యక్రమాలు ఉంటాయని.. కానీ ప్రేమ, సౌభ్రాతృత్వం పంచే అద్భుతం 'అలయ్ బలయ్' అని ఆయన కొనియాడారు.

Read More: 'అల్లు స్టూడియోస్' (Allu Studios) ప్రారంభోత్సవంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్!