మెగాస్టార్ (Megastar) ఫ్యామిలీతో మెగా ముచ్చట

Published on May 10, 2022 03:32 PM IST

మెగాస్టార్ సినిమా విడుదల అయ్యిందంటే..ఆ మజానే వేరు. హిట్, ఫ్లాప్ అనే ఫలితాలను పక్కన పెడితే, చిరు సినిమా అంటేనే ఓ పండగ. అభిమానుల కేరింతల మధ్య ఇలాంటి పండగ వాతావరణంలో, బాస్ సినిమా కోసం థియేటర్ల ముందు అభిమానులతో పాటు, సెలబ్రిటీలు కూడా పడికాపులు కాస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

ఈ వీడియోలో ఆచార్య సినిమా చూడడానికి, ఏఎంబీ సినిమాస్‌‌కు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు నటుడు సిద్ధు జొన్నలగడ్డ, వరుణ తేజ్, ఉపాసన కామినేని మొదలైన వారిని చూడవచ్చు. సాధారణంగా మెగాస్టార్ సినిమాను మొదటి రోజు, మొదటి షో చూడడం అనేది ఆ కుటుంబానికి ఉన్న ఆనవాయితీ. 

ఇటీవలే విడుదలైన ఆచార్య సినిమాను కూడా మెగాస్టార్ కుటుంబసభ్యులందరూ కలిసి తిలకరించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, చిరంజీవి సరసన నటించే అవకాశం కాజల్ అగర్వాల్‌కు దక్కింది. అయితే, సినిమా కథలో చేసిన ప్రధానమైన మార్పుల వలన, కాజల్ పాత్రను సినిమా నుండి తొలిగించడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.