Sitaramam Trailer Launch Event: 'సీతారామం' ట్రైలర్ లో అందం, అభినయంతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)

Published on Jul 26, 2022 07:27 PM IST

Sitaramam Trailer Launch Event: కోలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ట్యాగ్ లైన్. ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో  ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  

'సీతారామం' చిత్రంలో దుల్కర్ (Dulquer Salman) సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా..ముఖ్యమైన పాత్రలో రష్మిక మందన్న నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వివిధ పాత్రల లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందింది. ఇక, ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లాంఛ్ (Sitaramam Trailer Launch Event) కార్యక్రమం చిత్రయూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) మాట్లాడుతూ.. "అభిమానులందరూ రొమాంటిక్ హీరో, రొమాంటిక్ హీరో అని పిలుస్తుంటే.. విసుగొచ్చి ఇంక ప్రేమకథలు చేయకూడదని నిర్ణయించుకున్నా. అలాంటి సమయంలో హనుగారు ఈ కథతో వచ్చారు. అద్భుతమైన ప్రేమ కథ. చిరకాలం గుర్తిండి పోయే ఎపిక్ సినిమా. ఇలాంటి కథని ఎట్టిపరిస్థితిల్లో వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. నా చివరి ప్రేమకథగా  ‘సీతా రామం’ వంటి క్లాసిక్ ఎపిక్ లవ్ స్టొరీ చేయాలని ఫిక్సయ్యా" అని తెలిపారు.

చక్కటి ప్రేమకథా చిత్రం 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ బాలీవుడ్ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అందంగా అమాయకమైన చూపులతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు 'సీతారామం' ట్రైలర్ లో క్యూట్ గా కనిపిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది. సీతగా మృణాల్ మెప్పించిందో లేదో తెలియాలంటే ఆగస్ట్ 5 వరకు వేచి చూడాల్సిందే. బాలీవుడ్ లో 'జెర్సీ', 'సూపర్ 30' (Super 30) వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది మృణాల్. 

Read More: Sitaramam Trailer: ఒంటరి సైనికుడికి.. ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి ప్రేమ కథ.. 'సీతారామం' ట్రైలర్!