లైగర్ (Liger) సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Updated on May 01, 2022 06:22 PM IST
లైగర్ (Liger) లో మైక్ టైసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు
లైగర్ (Liger) లో మైక్ టైసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా, ఆగస్టు నెలలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ పట్ల యమ జోష్‌తో ఉన్నారు. అలాగే పూర్తి వైవిధ్యమైన కథనంతో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించడం విశేషం. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు మీకు ఇదే మా ప్రత్యేక కథనం

లైగర్ చిత్రం తెలుగుతో పాటు, హిందీ భాషలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లోకి కూడా హీరోగా అడుగుపెడుతున్నాడు. 

అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతీ పత్నీ ఔర్ ఓ లాంటి చిత్రాలతో హిందీలో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్న అనన్య పాండే, ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టనుంది. ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె.

అంతర్జాతీయ బాక్సర్, లెజెండరీ స్పోర్ట్స్‌మన్ మైక్ టైసన్, ఈ సినిమాతో తొలిసారిగా ఇండియన్ తెరపై కనిపించనున్నారు. ఆయనకు హీరో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్‌ను నిర్మాతలు ఆఫర్ చేశారట. 

ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్, ఆయన తల్లి హీరూ యాష్ జోహార్ ఈ సినిమా హిందీ వెర్షన్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే నటి ఛార్మి కౌర్ కూడా నిర్మాతలలో ఒకరు. పూరీ కనెక్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో నిర్మిస్తోంది. 

ఈ సినిమాలో హీరో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతుడు. మహ్మద్ అలీ, బ్రూస్లీ లాంటి లెజెండ్స్ ఒకప్పుడు ఈ కళలో రాణించారు. 

సర్కార్ రాజ్, రక్తచరిత్ర, ట్రాఫిక్, ది ఎటాక్స్ ఆఫ్ 26/11, రైడ్, రణ్ లాంటి హిందీ చిత్రాలకు డైలాగ్స్ రచించిన ప్రశాంత్ పాండే.. లైగర్ సినిమా బాలీవుడ్ వెర్షన్‌కి సంభాషణలు రాశారు. తెలుగు వెర్షన్‌కు మాత్రం దర్శకుడు పూరీయే డైలాగ్స్ రాశారు. 

హిందీలో జీరో, శింబా, మిషన్ మంగళ్, సాహో, స్ట్రీట్ డ్యాన్సర్, భాగీ 3 లాంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన తనిష్క్ బగ్చి, ఈ సినిమాకి కూడా బాణీలు సమకూర్చారు. 

ఎస్కేప్ ఫ్రమ్ ఉగాండా, సాల్ట్ మ్యాంగో ట్రీ లాంటి మలయాళ సినిమాలకు ఛాయాగ్రహణాన్ని అందించిన సినిమాటోగ్రాఫర్ విష్ఱు శర్మ.. ఈ చిత్రంలో కూడా తన కెమెరా పనితనాన్ని చూపించనున్నారు. 

ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా డబ్బింగ్ వెర్షన్‌గా రిలీజ్ కానుంది. 

ఇంతకీ లైగర్ అనే పదానికి అర్థమేంటో తెలుసా! పాంథేరా లియో జాతికి చెందిన సింహానికి, పాంథేరా లియో జాతికి చెందిన పులికి జన్మించే ఓ హైబ్రిడ్ క్రూరజంతువు. చాలా శక్తిమంతమైన మృగం.

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!