Vishwak sen: స‌క్సెస్ పార్టీలో సందడి చేసిన అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం టీమ్!

Published on May 07, 2022 04:25 PM IST

విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా రూపొందిన‌ సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. రుక్స‌ర్ థిల్లాన్, రితికా నాయ‌క్ క‌థానాయిక‌లుగా న‌టించారు. విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాగా.. సుధీర్, బాపినీడు ఈ సినిమాను నిర్మించారు. కాగా, ఈ చిత్రం ఈ నెల 6న విడుద‌లయింది . అయితే, ఈ సినిమా ప్రమోషన్ల‌ను కొత్తగా నిర్వ‌హించాల‌ని ట్రై చేసి, కాంట్రవర్శిలో చిక్కుకున్నాడు హీరో విశ్వక్. దీంతో కొద్దిరోజులుగా హాట్ టాపిక్ అయ్యాడు. మొత్తంగా అయితే సినిమా సక్సెస్ కొట్టేశాడు. ఓవైపు ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుంటోంది. దీంతో పాటు మ‌రోవైపు సినిమా చూసిన ప్రేక్షకులు ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా సర్టిఫికెట్ ఇస్తున్నారు.

కాగా.. ఇప్పటి వరకు న‌టించిన సినిమాల్లో మాస్‌ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ విశ్వక్‌ (Vishwak sen) ఈ సినిమా కోసం క్లాస్‌గా కనిపించాడు. దీంతో ఈ సినిమాపై భారీగా హైప్‌ క్రియేట్ అయింది. అయితే, అంచనాలను తగ్గట్లే ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్‌ షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ స‌క్సెస్ పార్టీ నిర్వ‌హించారు. తాజాగా నిర్వ‌హించిన ఈ పార్టీకి హీరో, హీరోయిన్ల‌తో పాటు, ద‌ర్శ‌కులు మిగిలిన సిబ్బంది హాజ‌ర‌య్యారు. ఈ త‌రుణంలో వారు మీడియా కంటికి చిక్కారు. అందులో చిత్ర యూనిట్ తో పాటు విశ్వ‌క్ సేన్ (Vishwak sen) ఉన్నారు. ఆయ‌న పార్టీకి వెళ్తున్న స‌మ‌యంలో బ‌య‌ట ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగుతూ కాసేపు సంద‌డి చేశారు. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.