"కృష్ణంరాజు (Krishnam raju) పేరులో రెబల్ ఉన్నా ఎంతో సౌమ్యుడు".. ఎమోషనల్ అయిన ఏపీ మంత్రి రోజా (Roja)..!

Published on Sep 13, 2022 01:26 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel star Krishnam raju) మృతి పట్ల ఏపీ మంత్రి ఆర్కే రోజా (Roja) సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణం రాజు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఎన్నటీకి రారాజేనని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన పేరులోనే రెబల్ ఉన్నా ఎంతో సౌమ్యుడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయుర్వేదం అంటే ఆయనకు చాలా ఇష్టమని చెప్పారు. అడిగిన వారందరికీ సాయం చేసే గొప్ప మనిషి అని కొనియాడారు.

సుదీర్ఘ కాలం సినీ పరిశ్రమలో కృష్ణంరాజు (Krishnam Raju) రారాజుగా వెలుగొందారని చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు మరణించారనే విషయం తాను జీర్ణించుకోలేక పోతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు సతీమణి పడుతున్న బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు. కృష్ణంరాజు గారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ (NTR), అక్కినేని నాగేశ్వరావు (ANR), కృష్ణంరాజు, శోభన్ బాబు తదితరులు పెద్ద దిక్కుగా ఉంటూ ఇండస్ట్రీని ఎలా ముందుకు నడిపించారో మనందరం కళ్లారా చూశామని అన్నారు. తాను ఆయనతో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసినప్పటికీ.. తాను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని చెప్పారు.

కృష్ణంరాజు భౌతికకాయానికి మంత్రి రోజా (AP Minister Roja) నివాళులు అర్పించారు. తాను ఎక్కడ కనిపించినా ఆయన ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను ఎంతో ఎంకరేజ్ చేశారని తెలిపారు. ప్రకృతిని చాలా బలంగా నమ్మిన వ్యక్తి అని...  అలాగే కృష్ణంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Read More: ఆ రెండు చివరి కోరికలు తీర్చుకోకుండానే తుది శ్వాస విడిచిన రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju)..!