ప్రెగ్నెంట్‌ అయినా రెస్ట్ లేకుండా షూటింగుల్లో అలియా భ‌ట్‌ (Alia Bhatt).. జాగ్రత్త అంటూ అభిమానుల ట్వీట్లు

Updated on Jul 13, 2022 07:14 PM IST
అలియా భట్(Alia Bhatt) -రణ్ బీర్ కపూర్‌ పెళ్లి ఫోటో
అలియా భట్(Alia Bhatt) -రణ్ బీర్ కపూర్‌ పెళ్లి ఫోటో

బాలీవుడ్ క్యూట్ క‌పుల్ అలియా భట్ (Alia Bhatt) -రణ్ బీర్ కపూర్‌లు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య ఒక్కటయ్యారు. పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పారు అలియా. అలియా ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా, సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

అలియా బేబీ బంప్‌తో షూటింగ్‌లో పాల్గొన్నప్పడు. కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ లీకైన ఫొటోలలో అలియా బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోందని, కాస్త జాగ్రత్తగా ఉండ‌మ‌ని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmastra

డార్లింగ్స్ సినిమాతో..

అలియా తన పోర్చుగల్ షూట్‌కు సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్వరలోనే ‘డార్లింగ్స్‌’ సినిమాతో ఓటీటీలో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు అలియా. ఈ సినిమాలో షెఫాలీ షా, విజయ్‌ వర్మ, రోషన్‌ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. ‘డ్లార్లింగ్స్‌’ను గౌరీఖాన్‌, గౌరవ్‌ వర్మతో కలిసి అలియా నిర్మించారు. ఆగస్టు 5వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

బాలీవుడ్‌లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా జంట వెండితెరపై సందడి చేయనుంది. మూడు భాగాలుగా విడుదల చేయనున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర.. మొదటి భాగం: శివ’ పేరుతో సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అలియా భట్‌ నటిస్తున్న సినిమా పోస్టర్లు

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నారు. కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో వస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ హీరో,హీరోయిన్లుగా నటించారు.

ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్న ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా 2023 ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హార్ట్ ఆఫ్‌ స్టోన్‌’ అనే అమెరికన్‌ స్పై సినిమాలో కూడా అలియా కనిపించనుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జీ లే జరా’ అనే సినిమాలో ప్రియంకా చోప్రా, కత్రినా కైఫ్‌లతో కలిసి అలియా(Alia Bhatt) సందడి చేయనుంది.

Read More : మంచి స్క్రిప్ట్‌ వస్తే సినిమాను నిర్మిస్తా.. గార్గి సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!