షూట్ టైమ్‌లో సామ్ (Samantha Ruth Prabhu) యాక్టివ్‌గా ఉండేది.. ఆమె అనారోగ్యం గురించి మాకు తెలియదు: వరలక్ష్మీ

‘యశోద’ (Yashoda) మూవీ షూటింగ్ టైమ్‌లో సామ్ (Samantha Ruth Prabhu) అనారోగ్యం గురించి తమకు తెలియదని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) అనారోగ్యంపై ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) స్పందించారు. సామ్ త్వరలోనే కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇంతకంటే బలంగా సామ్ తిరిగి వస్తారని వరలక్ష్మీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సమంత నాకు పన్నెండేళ్ల ముందు నుంచి తెలుసు. మా స్నేహం చెన్నై నుంచి స్టార్ట్ అయ్యింది. ‘యశోద’ (Yashoda) మూవీ కోసం సామ్‌తో కలసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సెట్‌లో మేమిద్దరం ఎంతో సరదాగా ఉండేవాళ్లం. చెన్నై నాటి రోజుల్ని గుర్తు చేసుకుని నవ్వుకునేవాళ్లం’ అని వరలక్ష్మీ తెలిపారు. 

‘యశోద’ షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారని తనకు తెలియదని సమంత అన్నారు. ఆ మూవీ సెట్‌లో సామ్ ఎప్పుడూ హుషారుగా ఉండేదని చెప్పారు. ‘షూట్ తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించిందని అనుకుంటున్నా. ఆమె ఓ యోధురాలు. త్వరలోనే తను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుంది’ అని వరలక్ష్మీ శరత్ కుమార్ పేర్కొన్నారు. తన తదుపరి సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నా. ఇందులో రోల్ కోసం సుమారు 15 కిలోల బరువు తగ్గా. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. దీంతోపాటు తెలుగు, తమిళంలో పలు ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నా’ అని వరలక్ష్మీ వివరించారు. 

ఇకపోతే, సమంత ఆరోగ్యంపై కొంతకాలంగా పలు రకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. సామ్ అనారోగ్యంగా ఉన్నారని.. ఆమె చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా సమంత స్పందించారు. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఆమె వెల్లడించారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఒక ఫొటోను ఆమె షేర్ చేశారు. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని సమంత తెలిపారు. ఈ విషయాన్ని పూర్తిగా కోలుకున్న తర్వాత అందరితో చెబుదామని అనుకున్నానని.. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందన్నారు. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని అర్థం చేసుకున్నానని సమంత వివరించారు.

ఇక, సమంత నటిస్తున్న కొత్త చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘యశోద’ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 

Read more: NTR30: ‘ఎన్టీఆర్ 30’ పై అదిరిపోయే అప్డేట్.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం.. త్వరలో షూటింగ్ స్టార్ట్!

You May Also Like These