రెండో పెళ్లికి సిద్దమైన మంచు మనోజ్ (Manchu Manoj).. కాబోయే భార్య భూమా మౌనిక (Bhuma Mounika) నేపథ్యం ఇదే..!

Published on Sep 07, 2022 02:18 PM IST

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానాలే తెరమీదకి వస్తున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్‌ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమెనే త్వరలో మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు  తెలుస్తోంది.   

తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక (Bhuma Mounika) ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఈ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ సీతాఫల్ మండిలోని గణేశ్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వీరిద్దరూ పాల్గొన్నారు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే టాక్ మొదలైంది. 

కాగా, మంచు మనోజ్‌ ఇదివరకే ప్రణతి రెడ్డి (Pranati Reddy) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆనాటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ ఎన్నో సార్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.  

ప్రణతి రెడ్డితో విడాకుల తర్వాత కెరీర్‌ పరంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనోజ్‌ సినిమాలకు కూడా కాస్త గ్యాప్‌ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న మనోజ్‌ (Manchu Manoj Second Marriage) తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘అహం బ్రహ్మాస్మి’ (Aham Brahmasmi) అనే చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.

Read More: పూజిత పొన్నాడ (Pujita Ponnada) ను రహస్యంగా వివాహం చేసుకున్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)..?