Thank You Trailer: 'థాంక్యూ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్న రాశీ ఖన్నా, నాగచైతన్య..!

Published on Jul 14, 2022 05:19 PM IST

Thank You Trailer: అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం ‘థాంక్యూ’. రాశీ ఖన్నా , మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ‘థాంక్యూ’ మూవీ ట్రైలర్‌  (Thank You Movie Trailer) ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం అక్కినేని అభిమానులు, చిత్ర యూనిట్‌ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. 

ఈ చిత్రంలో నాగచైతన్య (Akkineni Naga Chaitanya) మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా చైతన్య పాత్రలోని ఎమోషన్స్‌తో ట్రావెల్‌ అవుతాం. జోష్‌ తరువాత చైతూకు జీవితాంతం గుర్తుండే సినిమాను ఇవ్వాలని అనుకున్నాను. అది ఈ చిత్రంతో తీరింది. ఈ చిత్రం అందరి హృదయా ల్లో గుర్తుండిపోయే సినిమాగా వుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ అద్భుతమైన సినిమా చూశామనే ఫీలింగ్‌తో థియేటర్‌ నుంచి బయటికొస్తారు’ అన్నారు నిర్మాత దిల్ రాజు. 

ఇకపోతే రాశి ఖన్నా (Raashi Khanna), చైతన్య ఒక చిట్ చాట్ లో పాల్గొని వీరి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. తాను రాశి ఖన్నా కలిసి రెండు సినిమాలలో నటించామని తెలిపారు. నా గురించి రాశి ఖన్నాకు అన్నీ తెలుసు అలాగే తన ఇస్తా ఇష్టాలు గురించి నాకు తెలుసని చైతన్య తెలియచేశారు. 

Read More: Thank you Trailer: హృదయాన్ని తాకుతున్న నాగచైతన్య (Naga Chaitanya) మూవీ ‘థ్యాంక్యూ’ ట్రైలర్..!