Raashi Khanna: 'బాహుబలి' (Bahubali) లో దేవసేన వంటి పాత్రలో నటించాలని ఉంది: రాశీ ఖన్నా

Published on Jul 06, 2022 05:07 PM IST

Raashi Khanna: రాశీ ఖన్నా.. ఈ హాట్ బ్యూటీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఊహాలు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఆ సినిమాలో చూడ‌చక్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. దీంతో ఈ సినిమా తర్వాత ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.  

రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా, గోపీచంద్ హీరోగా నటించిన తాజా మూవీ ‘పక్కా కమర్షియల్’. జులై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా ఇంటర్వ్యూలతో బిజిబిజీగా గడ‌ప‌గా, ఈ ప్ర‌మోష‌న్స్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. ఎలాంటి సినిమాల్లో నటించడం మీకు ఇష్టం అని అడగ్గా ఆమె ఊహించని సమాధానం ఇచ్చింది.  

రాశీ ఖన్నా (Raashi Khanna) మీడియాతో మాట్లాడుతూ.. కామెడీ చేయడం కష్టమని.. కానీ రొమాన్స్ సీన్స్‌లో నటించడం సులభమంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఎలాంటి సినిమాల్లో నటించడం మీకు ఇష్టం అని అడగ్గా ఆమె ఈవిధంగా సమాధానం ఇచ్చింది. 'నాకు రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టం. కామెడీ సీన్స్ కంటే.. రొమాంటిక్ సీన్లలో నటించడమే సులభం. ఇప్పటివరకు నేను రొమాంటిక్ సీన్లలో యాక్ట్ చేశా. ప్రస్తుతం కామెడీ జోనర్‌ను ఎంజాయ్ చేస్తున్నా..' అని  చెప్పుకొచ్చింది. అదేవిధంగా.. ఎలాంటి పాత్ర చేయాలని ఉందని అడగ్గా.. 'బాహుబలి' సినిమాలో మిల్కీ బ్యూటీ చేసిన 'దేవసేన' లాంటి పాత్ర చేయాలని ఉందని పేర్కొంది.   

రాశీ ఖన్నా (Raashi Khanna) గతంలో కన్నా ప్రస్తుతం మరింత గ్లామర్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నా.. తెలుగు సంప్రదాయాలను సైతం పాటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఒక‌వైపు చీరలో క‌నిపిస్తూనే మ‌రోవైపు కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. 

Read More: Raashi Khanna: 'కామెడీ సీన్స్ కంటే.. అలాంటి సీన్లలో నటించడమే ఇష్టం'.. రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!