Sita Ramam: 'కానున్న కళ్యాణం' వంటి అందమైన పాట చేయడం కెరీర్ లో ఇదే మొదటిసారి.. దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)

Published on Jul 19, 2022 06:05 PM IST

Sita Ramam: టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న 'సీతా రామం' ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. రష్మిక మందన్న కీలక పాత్రలో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని థర్డ్ సింగల్ 'కానున్న కళ్యాణం' పాటని హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇందులో ఈ మూవీ హీరోహీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో దర్శకుడు తరుణ్ భాస్కర్ పాల్గొని సందడి చేశారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. "ఇందులో చాలా ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నా.దర్శకుడు హను గారు కాల్ చేసి. సీతా రామా మధ్యలో నీవు హనుమంతుడివి అని చెప్పారు.ఆయన ఒకసారి కథ చెప్పిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేస్తున్నాని చెప్పా. హను అద్భుతమైన దర్శకుడు.సీతారామం అందమైన ప్రేమకథ. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమ కథ చూడలేదు.ఆగస్ట్ 5న అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి" అని కోరారు.

'సీతారామం' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. "కానున్న కళ్యాణం" లాంటి అందమైన పాట చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. కశ్మీర్ మంచు, ట్రెడిషనల్ దుస్తులలో చాలా అందంగా చిత్రీకరించాం. మోస్ట్ రొమాంటిక్, విజువల్ వండర్ లాంటి సాంగ్ ఇది. ఇది నా ఫేవరేట్ సాంగ్. ఈ పాటని మీ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇంతమంది విద్యార్ధులను ఒక్క చోట చూడటం ఇదే మొదటిసారి. ఆగస్ట్ 5న అందరం థియేటర్ లో కలుద్దాం అని అన్నారు

'సీతారామం' లోని ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని బాగా అలరించింది. కాగా, ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. సింగర్స్ అనురాగ్ కులకర్ణి, సింధూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా ఉంది.లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా ఉంది.

Read More: Sita Ramam Teaser: 'యుద్ధం రాసిన ఈ ప్రేమకథలో ఇద్దరు ప్రేమికులు'.. 'సీతారామం' టీజర్!