Faria Abdullah: డ్యాన్సులతో హోరెత్తిస్తున్న 'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా..!

Published on Jun 13, 2022 03:00 PM IST

టాలీవుడ్ లో తాను నటించిన తొలి చిత్రంతోనే తనదైన అందం, ప్రతిభతో మెప్పించింది ఫరియా అబ్ధుల్లా (Faria Abdullah). ఈ బ్యూటీ 'జాతి రత్నాలు' సినిమాలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సరసన చిట్టి పాత్రతో హృదయాలను గెలుచుకుంది. ఆరడగుల ఈ అందమైన భామ పొడుగుకాళ్ల సుందరిగానూ కుర్రాళ్ల మనసులు దోచింది. అయితే, తాజాగా ఈ బ్యూటీ తనకు డ్యాన్స్ పై ఉన్న ప్రేమ గురించి వివరించింది. ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెమటలతో తడిసి ముద్దయ్యేంతగా తన ప్రాక్టీస్ సెషన్ కొనసాగిందని ఈ వీడియో చూస్తూ అర్థమవుతోంది. అయితే, ఈ భామ ఎప్పటికప్పుడు తనను తాను వీలైనంత బిజీగా ఉంచుకోవడానికే ఇష్టపడుతుంది.

ఆ మధ్య కడప నగరంలో ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. గురువారం అక్కడి అల్మాస్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వావ్‌ హీరో’ (Wow Hero) ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై షో రూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, మేయర్‌ సురేశ్‌ బాబు, ఎండీ నవీన్‌ తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసింది. అయితే షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఫరియా ఈ సందర్భంగా కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకుంది. దర్గా సంపద్రాయం ప్రకారం ఫరియాకు దర్గా ముజావార్లు ఘనంగా స్వాగతం పిలికారు. దర్గా మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఫరియా అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకుంది. 

అనంతరం ఫరియా (Faria Abdullah) డ్యాన్స్ వల్ల కలిగే ప్రయోజాల గురించి కూడా ముచ్చటించింది. మనసు ప్రశాంతంగా ఉండటానికి డ్యాన్సుల కోసం సమయం కేటాయిస్తానని తెలిపింది. తనకు ఇష్టమైన టీవీ సిరీస్ ని అతిగా వీక్షించడం కూడా విశ్రాంతి తీసుకునే సులభమైన మార్గాలలో ఒకటి అని పేర్కొంది. తనకు కామెడీ జానర్ చాలా ఇష్టం. నేను సాధారణంగా ఆఫీస్ లేదా హౌ ఐ మెట్ యువర్ మదర్ ఎపిసోడ్ ని చూస్తానని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా, ఫరియాకు డ్యాన్స్ పై ఉన్న ప్రేమ, మమకారం గురించి ఇదివరకే ప్రపంచానికి తెలుసు. రేయింబవళ్లు డ్యాన్స్ కోసం ఎంతో శ్రమిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం ఇంతకుముందే వైరల్ అయ్యాయి. 

మరోవైపు ఫరియా అబ్దుల్లా.. తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ కళాకారిణి హర్ష మహేశ్వరి, సీరియల్ ఆర్టిస్ట్ రాజ్ జనగాం  సంయుక్తంగా అతి పెద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ‘సైఫర్ హౌర్స్ వాల్యూమ్ 11’ పేరుతో నిర్వహిస్తున్నారు. జూన్ 25, 26 తేదీలలో హైదరాబాద్‌లోని ప్రిజం క్లబ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రౌచర్‌ని మంగళవారం విడుదల చేశారు. హైదరాబాద్, వెస్ట్రన్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మనోహర్ రావు, సినీనటులు ఫరియా అబ్దుల్లా, సాన్వే మేఘన, సిద్దు జొన్నలగడ్డ, లక్ష్మీ మంచు, సుశ్మిత కొణెదల, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ (Anup Rubens) పాల్గొన్నారు.

Read More: Faria Abdullah:డ్యాన్స్ ఇరగదీసిన 'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా..!