బర్త్ డే వేడుకల్లో బిగ్ బాస్(TeluguBoggboss) బోల్డ్ బ్యూటీ నందినీ రాయ్ (NandiniRai) హంగామా మామూలుగా లేదుగా..!

Published on Sep 19, 2022 09:07 PM IST

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో (Telugu Boggboss) సత్తా చాటి ఆ తర్వాత తన క్రేజ్ పెంచుకుని వరుస వెబ్ సీరీస్ లలో నటిస్తోంది అందాల భామ నందినీ రాయ్ (Nandini Rai). తాజాగా ఆమె పుట్టినరోజు వేడుకలు.. ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ తారలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హాజరై సందడి చేశారు.

నందినీ రాయ్ (Nandini Rai) బర్త్ డే సెలబ్రేషన్స్ లో నటుడు సాయి కుమార్, హీరోలు వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనీష్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు సోహైల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్-నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్ వేగేశ్న తదితరులు హాజరయ్యారు. 

బుల్లితెర, వెండితెర భామలంతా వారితో పాటుగా బిగ్ బాస్ బ్యాచ్ అంతా కూడా నందిని రాయ్ బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు. వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఈ అమ్మడు. 

నందినీ రాయ్ (Nandini Rai) కెరీర్ విషయానికి వస్తే.. 2011లో వచ్చిన 040 అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత మాయ, ఖుషీఖుషీగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని తదితర సినిమాల్లో హీరోయిన్, సహాయ పాత్రల్లో నటించింది. అలా కొన్నాళ్లకు బిగ్ బాస్ 2లోనూ ఓ కంటెస్టెంట్ గా పాల్గొని తనదైన ఆటతో ప్రేక్షకుల్ని మెప్పించింది. 

అయితే, నందినీ రాయ్ సినిమాల్లో కన్నా వెబ్ సిరీస్ (Nandini Rai WebSeries) లు చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య సాయికుమార్, రాధిక శరత్ కుమార్ నటించిన ‘గాలివాన’ వెబ్ సిరీస్ లో ఓ కీలకపాత్ర చేసి ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ లతో తన గ్లామర్ షోతో ఎలాంటి సన్నివేశాలకైనా ఈ అమ్మడు రెడీ అంటోంది.

సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే నందిని రాయ్.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలు (Nandini Rai Glamour Photos) పోస్ట్ చేస్తూ నెటిజన్స్ కి కనులవిందు చేస్తూనే ఉంది. ఇప్పుడు బర్త్ డే వేడుకలోనూ బ్రౌన్ కలర్ ఔట్ ఫిట్ లో అందంగా కనిపించింది. ప్రేక్షకులైతే ఆమె నటనతో పాటు గ్లామర్ కి ఫిదా అయ్యారు.

Read More: Nandini Rai: ఐట‌మ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్న‌ బిగ్ బాస్ సీజ‌న్ 2 బ్యూటీ నందినీ రాయ్!