దీపావళి పండగ మాకో సెంటిమెంట్.. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం: రష్మికా మందన్న(Rashmika Mandanna)

దీపావళి పండుగకు ఓ సంప్రదాయాన్ని తాము ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నామని హీరోయిన్ రష్మికా మందన్న (Rashmika Mandanna) అన్నారు

కన్నడ భామ రష్మికా మందన్నకు తెలుగు నాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో కన్నడ చిశ్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు.. టాలీవుడ్‌లో స్టార్ డమ్ దక్కింది. నాగశౌర్యతో నటించిన ‘ఛలో’తో తెలుగులో ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత  పాన్ ఇండియా సెన్సేషన్ విజయ్ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’తో ఇక్కడ ఓవర్‌నైట్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ‘డియర్ కామ్రేడ్’, ‘భీష్మ’ లాంటి సినిమాలు యూత్‌లో ఆమె క్రేజ్‌ను మరింతగా పెంచాయి. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’తో బాలీవుడ్‌లోనూ రష్మిక క్రేజ్ ఓ రేంజ్‌కు చేరుకుంది. శ్రీవల్లిగా చక్కటి నటనతో అందర్నీ ఆమె అలరించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలసి రష్మిక యాక్ట్ చేసిన ‘గుడ్ బై’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కమర్షియల్‌గా అంతగా సక్సెస్ కాకున్నా.. రష్మికకు మాత్రం మంచి పేరే తీసుకొచ్చింది. ఆమె నటిస్తున్న పలు హిందీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలు, ఓ తమిళ సినిమాతో బిజీగా ఉన్నారు. దళపతి విజయ్ సరసన ‘వరిసు’ (వారసుడు)లో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆమె యాక్ట్ చేయనున్న ‘పుష్ప‌‌2’ ఫిల్మ్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా, దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరుకు వెళ్లిందీ కన్నడ కస్తూరి. దీనిపై ఆమె స్పందిస్తూ.. అలుపెరగనంత బిజీగా ఉన్నా.. పండుగలు, పర్వదినాలను ఫ్యామిలీతో జరుపుకుంటానని రష్మిక తెలిపారు. 

ముఖ్యమైన పండుగ రోజుల్లో బంగారం, వెండి ఆభరణాలను కొనడం తమ కుటుంబానికి సెంటిమెంట్ అని రష్మిక అన్నారు. అలాగే కొత్త సినిమాల ప్రారంభానికి ముందు బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడమనే సెంటిమెంట్‌ను తమ ఫ్యామిలీ చాన్నాళ్లుగా కొనసాగిస్తోందని చెప్పారు. ‘నన్ను, చెల్లిని మహాలక్ష్ములు అని మా నాన్న అంటుంటారు. అలా పిలవడం నాకు గర్వంగా అనిపిస్తుంది’ అని రష్మిక చెప్పుకొచ్చారు. 

Read more: నాకు ప్రేమించేంత సమయం లేదు: రష్మికా మందన్న (Rashmika Mandanna)

You May Also Like These