"ఫేస్ బుక్ మెటా క్రియేటర్ డే" ఈవెంట్ లో ఆటపాటలతో అలరించిన రష్మిక మందన్నా (Rashmika Mandanna)..!

Published on Oct 18, 2022 06:12 PM IST

Rashmika Mandanna: హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఫేస్ బుక్ మెటా నిర్వహించిన క్రియేటర్ డే ఈవెంట్ లో (Creator Day Event) ప్రముఖ సినీనటి రష్మిక మందన్నా (Rashmika Mandanna), తన ప్రదర్శనతో  ప్రేక్షకులను అలరించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన పలు పాటలకు రీల్స్ చేసి ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అత్యున్నత క్రియేటర్లును ఓ దరికి చేర్చి ఈ  కార్యక్రమం ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రీల్స్‌తో మీరు సంస్కృతులను నిర్వచిస్తున్నారు. 

మేము చేసిన సినిమాలు, వాటిలోని పాత్రల ద్వారా మీరు స్ఫూర్తి పొంది ఉండవచ్చేమో కానీ  మీ ద్వారా నేను కూడా స్ఫూర్తి పొందానని రష్మిక మందన్నా పేర్కొన్నారు. 

మెటా(గతంలో ఫేస్‌బుక్‌) నేడు హైదరాబాద్‌తో పాటుగా దేశవ్యాప్తంగా క్రియేటర్ల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా క్రియేటర్స్‌ డే నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రియేటర్ల కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని సైతం విడుదల చేశారు. అక్కడ వారు మెటాతో కలిసి పనిచేయడంతో పాటుగా తమ సొంత అగుమెంటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌) ఎఫెక్ట్స్‌ను పొందవచ్చు.

Read More: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై రష్మిక మందన్నా (Rashmika Mandanna) కీలక వ్యాఖ్యలు..!