బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)కు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందించింది. ఆయన నటించిన ‘బ్రహ్మాస్త్ర’, ‘షంషేరా’ చిత్రాలు ఈ సంవత్సరం రిలీజ్ అయ్యాయి. వీటిల్లో ‘బ్రహ్మాస్త్ర’ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ‘షంషేరా’ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. ఇక ప్రేయసి అలియా భట్‌తో రణ్‌బీర్ వివాహం ఇదే ఏడాది అవ్వడం.. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టడం విశేషం. దీంతో రణ్‌బీర్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
ఇకపోతే, రణ్‌బీర్ ప్రస్తుతం దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రీసెంట్గా ఒక అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న రణ్‌బీర్ తనకు చాన్స్ వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాల్సిందిగా రణ్‌బీర్‌కు ఆహ్వానం అందింది. దీంతో ఈ ఫెస్టివల్‌కు ఆయన విచ్చేశారు. ఈ ఈవెంట్లో ఆయన ‘వెరైటీ ఇంటర్నేషనల్ వాన్ గార్డ్ యాక్టర్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మీడియాతో రణ్‌బీర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ రణ్‌బీర్‌ను పాకిస్తాన్ సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నించారు. దీనికి రణ్‌బీర్ స్పందిస్తూ.. ‘తప్పకుండా. నా దృష్టిలో కళాకారులకు సరిహద్దులు లేవు’ అని చెప్పారు.
‘ఆర్టిస్టులకు కళల విషయంలో హద్దుల్లేవ్. ప్రస్తుతం నేను సౌదీ అరేబియాలో ఉన్నా. నాకు ఇక్కడి పరిశ్రమతో పని చేయాలని ఉంది. కుదిరితే ఇదే స్టేజీపై ఓ సినిమాకు సంతకం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అలాగే చాన్స్ లభిస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటించేందుకు నేను రెడీగా ఉన్నా’ అని రణ్‌బీర్ చెప్పుకొచ్చారు. దీంతో రణ్‌బీర్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది.
అలియా–రణ్‌బీర్‌లు పర్మినెంట్‌గా పాకిస్తాన్‌కు వెళ్లిపోండి అంటూ కొందరు నెటిజన్స్ ఈ స్టార్ కపుల్స్‌పై మండిపడుతున్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకొని పాక్‌లో సెటిల్ అవ్వండి అంటూ మరికొందరు నెటిజన్స్ రణ్‌బీర్ దంపతులను లక్ష్యంగా చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు.
Read more: Avatar: The Way of Water: 'అవతార్2' లో కొత్త పాత్రలను పరిచయం చేయనున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్
Follow Us