పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ఆదిపురుష్’ (Adipurush) మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పండుగకు వస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే వారికి నిరాశ తప్పేలా లేదు. ‘ఆదిపురుష్’ వాయిదా పడిందని టాలీవుడ్ టాక్. ఈ విషయంపై ఈ వారం రోజుల్లో మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
‘ఆదిపురుష్’ చిత్రం రిలీజ్‌ను వచ్చే ఏడాది వేసవికి మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఇటీవల రిలీజైన టీజర్‌పై విమర్శలు రావడంతో విజువల్ ఎఫెక్ట్స్‌ను మెరుగుపర్చడంపై మూవీ టీమ్ పని చేస్తోందట. ఒకవేళ ‘ఆదిపురుష్’ సమ్మర్‌కు వాయిదా పడితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం దొరుకుతుంది. కానీ ప్రభాస్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసే ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు.
ఇకపోతే, ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తున్నారు. విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇటీవల రిలీజైన ‘ఆదిపురుష్’ టీజర్ మీద మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ టీజర్ బాగుందని డార్లింగ్ ఫ్యాన్స్ అంటుంటే.. ఇదో కార్టూన్ మూవీలా ఉందని నెటిజన్స్ అంటున్నారు.
‘ఆదిపురుష్’ టీజర్ మీద వస్తున్న ట్రోల్స్ మీద ఓం రౌత్ స్పందించారు. ట్రోలింగ్ చూసి తాను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమేనని రౌత్ అన్నారు. అయితే, ట్రోలింగ్ వల్ల తానేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదన్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను వెండితెర కోసం తీశామని ఓం రౌత్ స్పష్టం చేశారు. ఈ మూవీని మొబైల్ ఫోన్లలో చూసేందుకు తీయలేదన్నారు. అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఆడియెన్స్ కోసం టీజర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రౌత్ పేర్కొన్నారు.
‘మేం కొద్ది మంది కోసమే ‘ఆదిపురుష్’ సినిమాను తీయలేదు. బిగ్ స్క్రీన్లకు దూరమైన వారి కోసం, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారినీ థియేటర్లకు రప్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది రామాయణ గాథ. గ్లోబల్ కంటెంట్ కోరుకుంటున్న తర్వాతి జనరేషన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీస్తున్నాం. వారికి అర్ధమయ్యే విధంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మేం ఈ మార్గాన్ని (3డీ మోషన్ క్యాప్చర్)ను ఎంచుకున్నాం’ అని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.
Follow Us