బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా తర్వాత వచ్చిన భారీ ప్రాజెక్టుల రిజల్ట్స్ ఆయనను నిరాశపరిచాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస దగ్గర సందడి చేయలేకపోయాయి. దాంతో తన తర్వాతి సినిమాపైనే ఫోకస్ పెట్టారు ప్రభాస్. ఈ క్రమంలో భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి క్యారెక్టర్ పోషించారు. సీత పాత్రను కృతిసనన్ పోషించారు. దసరా పండుగ సందర్భంగా ఆదిపురుష్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా ఈ టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన సినిమాలో చాలా తప్పులు చేశారని సోషల్ మీడియాలో, బయట కూడా చాలామంది విమర్శలు చేశారు.
విమర్శల కారణంగా..
ఆదిపురుష్ సినిమా రామాయణాన్ని అపహాస్యం చేసేలా ఉందని, గ్రాఫిక్స్ సరిగ్గా లేవని మరికొందరు విమర్శించారు. దాంతో వాటిని సరి చేసే పనిలో పడింది చిత్ర యూనిట్. దీని కోసం భారీగానే ఖర్చు చేయడానికి రెడీ అయినట్టు టాక్. ఇక, ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. గ్రాఫిక్ వర్క్స్‌లో మార్పుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు.
ఈ వార్తలను నిజం చేస్తూ ఆదిపురుష్ సినిమాను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం లేదని ప్రకటించింది. ఆదిపురుష్ సినిమా విడుదలకు కొత్త తేదీని వెల్లడించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush)ను 2023, జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు దర్శకుడు ఓం రౌత్.
Read More : ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా విడుదల మరింత ఆలస్యం !
Follow Us