Adipurush : ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ గ్రాఫిక్స్‌లో మార్పులు.. రాజమౌళి (SS Rajamouli) చేతికి బాధ్యతలు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ సినిమా టీజర్‌‌పై విమర్శల నేపథ్యంలో గ్రాఫిక్స్‌ మార్పులకు భారీగా ఖర్చుపెట్టనుంది చిత్ర యూనిట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఆదిపురుష్‌’ (Adipurush) కూడా ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్‌ డైరెక్టర్‌‌ ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించారు. కృతి సనన్ సీత క్యారెక్టర్‌‌ చేశారు.

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌.. ఆదిపురుష్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌‌ను విడుదల చేశారు మేకర్స్. ఆ టీజర్‌‌కు మిశ్రమ స్పందన వచ్చింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన సినిమాలో చాలా తప్పులు చేశారని సోషల్ మీడియాలో, బయట కూడా చాలామంది విమర్శలు చేశారు.

రెబల్‌స్టార్‌‌ ప్రభాస్‌ను బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌‌ను చేసిన డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి. ప్రభాస్‌తో సినిమా అంటే కనీసం వంద కోట్ల బడ్జెట్‌ పెట్టాల్సిందేననే స్టేజీకి తీసుకొచ్చారు దర్శకధీరుడు. ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. కేవలం ఆదిపురుష్‌ సినిమా బడ్జెట్‌ దాదాపుగా రూ.500 కోట్లు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే గ్రాఫిక్స్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో సినిమా విడుదల తేదీలో మార్పులు చేసింది చిత్ర యూనిట్. 2023, జూన్‌ 16వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు దర్శకుడు ఓం రౌత్.

కాంప్రమైజ్‌ అయ్యేది ఉండదనే..

ఆదిపురుష్‌ సినిమా టీజర్‌‌పై వచ్చిన కామెంట్స్‌ను ప్రభాస్‌తోపాటు చిత్ర యూనిట్‌ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. బెస్ట్ అవుట్‌పుట్‌ వచ్చేలా గ్రాఫిక్స్‌లో మార్పులు చేయనున్నట్టు తెలిసింది. దీనికోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నారని టాక్. అయితే బాధ్యతలను దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) చేపట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి.

హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం రాజమౌళికి ఉంది. ఆయన పర్యవేక్షణలో వచ్చే గ్రాఫిక్స్‌ నేచురాలిటీకి దగ్గరలో ఉంటాయి. అంతేకాదు, తనకు కావాలసినట్టుగా గ్రాఫిక్స్ వచ్చేవరకు రాజమౌళి కాంప్రమైజ్‌ అవ్వబోరని, అందుకే ఆయనను జక్కన అని పిలుస్తారని తెలిసిందే. దాంతో ఆదిపురుష్ గ్రాఫిక్స్‌ వర్క్స్‌ బాధ్యతలను రాజమౌళికి అప్పగించనున్నట్టు టాక్ నడుస్తోంది. అదే నిజమైతే ఆదిపురుష్‌ (Adipurush) సినిమా గ్రాఫిక్స్‌పై వచ్చిన నెగెటివ్‌ కామెంట్స్‌ అన్నింటికీ తప్పకుండా పుల్‌స్టాప్ పడుతుందని ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. 

Read More : ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా రిలీజ్ వాయిదా! కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్

You May Also Like These