Ketika Sharma: టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నంలో 'రంగరంగ వైభవంగా' మూవీ హీరోయిన్ కేతికా శర్మ..!

Published on Jun 24, 2022 06:06 PM IST

టాలీవుడ్ లో 'రొమాంటిక్' (Romantic Movie)సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ 'కేతికా శ‌ర్మ‌'. రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది. 

'రొమాంటిక్' సినిమా ఆ మధ్య విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు  యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ (Ketika Sharma) హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో సూదులు గుచ్చుతోంది. అదేవిధంగా పర్సనల్ విషయాలతో పాటు సినిమా అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు నెట్టింట్లో పంచుకుంటోంది. 

ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Hero Vaishnav Tej) తో కలిసి 'రంగరంగ వైభవంగా' సినిమాలో నటిస్తోంది. రీసెంట్‌గా  ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. 

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తో 'లక్ష్య' సినిమాలోనూ మెరుపులు మెరిపించింది ఈ బ్యూటీ. టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కుర్ర హీరోయిన్లలో (Krithi Shetty) కృతి శెట్టి.. 'పెళ్లి సందD' శ్రీలీల తరువాత స్థానంలో కేతిక శర్మ కనిపిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటివరకు చేసిన రెండు సినిమాలు కూడా కథాకథనాల పరంగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా సరే కేతికా శర్మకు అవకాశాలు మాత్రం అడక్కుండానే వస్తున్నట్టు సమాచారం. 

ప్ర‌స్తుతం కేతికా శ‌ర్మ (Ketika Sharma) క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా, త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘వినోద‌య సిత్తం’ రీమేక్‌ను త్వ‌ర‌లో మొద‌లు పెట్ట‌నున్నాడు టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన స‌ముద్ర‌ఖని ఈ రీమేక్‌ను కూడా తెర‌కెక్కిస్తున్నాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌రో ప్రధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప‌లువురు పేర్లు అనుకున్న కేతిక శ‌ర్మ‌ను ఫైన‌ల్ చేశార‌ని స‌మాచారం. 

ఇక, కేతిక శర్మ విషయానికొస్తే.. 24 డిసెంబర్ 1995లో న్యూ ఢిల్లీలో జన్మించింది. ఈమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో ఈమె పాపులర్ అయింది. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190K ఫాలోవర్స్ ఉన్నారు.  

Read More: Ketika Sharma: అందాలతో అగ్గి రాజేస్తున్న 'రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మ.. ఫొటోలు వైరల్!