5 places to visit in India when you turn 30: భూలోక స్వర్గాలు
1.సోలాంగ్ వ్యాలీ (Solang Valley)
సోలాంగ్ వ్యాలీకి వెళితే స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్ లో ఉన్నామా అనిపిస్తుంది. కళ్లుమూసుకుని గట్టిగా శ్వాస తీసుకుని పర్వత గాలిని పీల్చుకుంటూ సోలాంగ్ వ్యాలీని చూడండి. మంచుతో కప్పిన పర్వతాలు, దట్టమైన అడవులు, నీలి ఆకాశం, దేవతలు రంగులేసినట్టు ఉండే పర్వతాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీరు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా గడిపేందుకు సోలాంగ్ వ్యాలీ ఓ అద్భుతమైన ప్రదేశం. ఈ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది.
2.చంద్రతాల్ (Chandra Taal)
ప్రపంచంలోనే అత్యంత అందమైన సరస్సు. చంద్రుడి ఆకారంలో కనిపించే ఈ సరస్సుకు చంద్రతాల్ అని పేరు పెట్టారు. హిమాచల్లో ఉండే ఎత్తైన సరస్సు కూడా ఇదే. ట్రెకింగ్ చేయడం మీకు ఇష్టమైతే కచ్చతంగా 30 ఏళ్ల లోపే ఇక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించండి. లోతైన నీలీరంగ సరస్సు ... మంచుతో ఉన్న పర్వతాలు... కన్నుల విందు చేసే దృశ్యాలు... మీకు ఓ మంచి జ్ఞాపకంగా మిలిగిపోతుంది..
3.కూర్గ్ (Coorg)
కూర్గ్ కొత్తజంటల స్వర్గం. కర్ణాటక కశ్మీర్ అని దీనికి పేరు. కూర్గ్ అధికారికంగా 'కొడగు' అని పిలుస్తారు. ఈ ప్రాంతం పచ్చని చెట్ల మధ్య చల్లటి వాతావరణం కలిగి ఉంటుంది. కాఫీ తోటల పరమళం మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. జలపాతాలు కనుల విందు చేస్తాయి. చెట్లపైన ఉంటే వసతి గృహాలు అద్భుతంగా ఉంటాయి. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఆనందానిచ్చే పర్యాటక ప్రాంతం కూర్గ్.
4.అండమాన్ (Andaman)
భూలోక సర్గం అండమాన్ దీవి. నీలి రంగు ఆకాశం అదే నీలిరంగు నీరు మధ్యలో పచ్చని చెట్లు ఇలా ఎంత వర్ణించినా ఈ దీవి గురించి తక్కువే అవుతుంది. ప్యారెట్ ఐల్యాండ్ పక్షులు, ఆక్వా ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. మడ అడవుల్లోని రామచిలుకలు సందడి చేస్తుంటాయి. చూట్టూ నీళ్లు మధ్యలో ల్యాండ్ అదే ఐల్యాండ్. పర్యాటకుల మనసు దోచే దీవి అండమానే.
5.పుష్కర్
పుష్కర్ అంటే నీలి తామర పువ్వు అని అర్ధం. రాజస్థాన్ లో చరిత్ర కలిగన పర్యాటక ప్రాంతం పుష్కర్. పెంపుడు జంతువుల సంత అంటే పుష్కర్ మేళాకు దేశ,విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. పుష్కర్ లో ఒంటే సవారీ భలే బాగుంటుంది.