4 Signs you are an option and not a priority : మీరు అలుసైపోయారా?

Updated on Apr 16, 2022 05:45 PM IST
ఇష్ట‌ప‌డే వారు అయిష్టంతో ఉంటే భ‌రించ‌డం క‌ష్ట‌మే. బందం కేవ‌లం శారీర‌క సంభందం కోస‌మే అనుకుంటే త‌ప్పే. మీ భాగ‌స్వామి మీకు ప్రాధ‌న్య‌త ఇవ్వాల‌నుకోవ‌డం చెడ్డ విష‌యం కాదు. ఇష్టంతో ఎన్ని చేనినా గుర్తించ‌డం లేద‌ని మీరు ఫీల్ అవుతున్న‌రా? మీ భాగస్వామి మీకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని తెలిపే సంకేతాలు ఇలా ఉంటాయి.
ఇష్ట‌ప‌డే వారు అయిష్టంతో ఉంటే భ‌రించ‌డం క‌ష్ట‌మే. బందం కేవ‌లం శారీర‌క సంభందం కోస‌మే అనుకుంటే త‌ప్పే. మీ భాగ‌స్వామి మీకు ప్రాధ‌న్య‌త ఇవ్వాల‌నుకోవ‌డం చెడ్డ విష‌యం కాదు. ఇష్టంతో ఎన్ని చేనినా గుర్తించ‌డం లేద‌ని మీరు ఫీల్ అవుతున్న‌రా? మీ భాగస్వామి మీకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని తెలిపే సంకేతాలు ఇలా ఉంటాయి.

1. మీ ప్ర‌య‌త్నాలే ఉండ‌టం

మీ భాగ‌స్వామికి మీరే ఫోన్లు, మెసేజు చేస్తూ వారిని క‌ల‌వాల‌ని ఆశ‌ప‌డుతున్నారా ?. వారి ప్రేమ కోసం మీరే ఆరాటప‌డుతున్నారా ?. ఇన్ని చేస్తున్నా, మీ భాగ‌స్వామి ప‌ట్టుకోకుంటే వారికి మీ ప‌ట్ల ఇష్టం త‌గ్గింద‌నే అర్ధం. మీ భాగ‌స్వామి కోసం అన్ని చేస్తూ.. అవ‌త‌లి నుంచి ఏమీ పొందకుంటే.. అవ‌న్నీ నిరాశ‌లే. వారు మీరంటే అయిష్టంతో ఉన్నార‌ని అర్ధం. 

2. మీ త్యాగాలకు గుర్తుంపు ఉండదు

మీపై ఇష్టం త‌గ్గితే మీ ప్రేమ‌, సేవ‌లు, త్యాగాలు.. అవేవీ మీ భాగస్వామికి కనిపించవు. మీ బంధం కోసం మీరు ఏం చేసినా వారు  గుర్తించ‌రు. ఇత‌రులు మిమ్మల్ని గౌర‌వించినా.. మీ భాగ‌స్వామి మాత్రం అభినందించ‌రు. 

3. శారీర‌క సంబంధం కోసమేనా?

మీ భాగ‌స్వామి మీ నుండి శారీరక సుఖం మాత్రమే కోరుకుంటున్నట్లు, మీకు అనిపిస్తుందా? అదే తనకు ప్రధానమై, మిగ‌తా విష‌యాల‌లో మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? అయితే తను మీకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని తెలుసుకోండి. 

4. మీరు సంతోషాన్ని కోల్పోయారా?

మీ సంతోషం కోరుకోని మీ భాగ‌స్వామితో గ‌డ‌పడం అంటే, అభ‌ద్ర‌తా భావంతో ఉండ‌ట‌మే. మీకు మ‌ర్యాద ఇవ్వ‌ని వ్య‌క్తుల‌తో క‌లిసి ఉంటూ, అసంతృప్తితో గ‌డ‌ప‌ట‌మే. 

ఇష్టప‌డిన వారితో సంతోషంగా ఉండ‌ట‌మే జీవితం. మీకు ప్రాధాన్య‌త ఇవ్వ‌ని, మీ భాగ‌స్వామితో మీరు జీవితాంతం ఉండాల‌నుకుంటే.. వారిని మార్చేందుకు ప్ర‌య‌త్నించండి. మీ భాగ‌స్వామిలో మార్పు రాక‌పోతే మీరు మారండి. మీరంటే ఇష్టం లేని వారితో జీవితం కొన‌సాగించాలా? వ‌ద్దా? అని ఆలోచించుకోండి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!