Priya Prakash Varrier: సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న వింక్ బ్యూటీ 'ప్రియా ప్రకాష్ వారియర్'..!

Published on Jul 12, 2022 07:15 PM IST

Priya Prakash Varrier: ప్రియా ప్రకాష్ వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. 'ఓరు అదార్ లవ్' సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న ఓ సీన్‌కి సంబంధించిన చిన్న వీడియోలో కన్నుగీటి రాష్ట్రాలన్నిటినీ పడేసింది. అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీస్ కూడా తన కన్ను గీటిన వీడియోకి ఫ్యాన్స్ అయ్యారు. అంతగా 20 సెకన్ల వీడియోతో పాపులర్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్.  

ఈ కేరళ కుట్టి... చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన (Priya Prakash Varrier) ప్రియా వారియర్... సోషల్ మీడియాలో 7 మిలియన్ పైగా ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మోడలింగ్ చేస్తూ... బ్యూటీ పేజెంట్స్‌లో ర్యాంప్ వాక్‌తో కట్టిపడేస్తోంది. 

2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు. వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)గా గుర్తింపు పొందిన అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ‘చెక్’ (Check Movie) సినిమాతో పలకరించింది.

పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న లైగ‌ర్ (Liger Movie) సినిమాలో అవ‌కాశం ఇచ్చార‌ని స‌మాచారం. అయితే ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా కాదు.. స్పెష‌ల్ సాంగ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చిందేయ‌నుంద‌ని స‌మాచారం. ముందుగా ఓ స్టార్ హీరోయిన్‌తో ఈ స్పెష‌ల్ సాంగ్ చేయించాల‌ని పూరీ జ‌గ‌న్నాథ్ భావించిన‌ప్ప‌టికీ కుద‌ర‌లేదు. దీంతో ఆయ‌న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను రంగంలోకి దింపార‌ట‌.  

Read More: Priya Prakash Varrier: ఒకే ఒక్క కన్ను గీటుతో అభిమానుల్ని సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్.. అందాలు అదరహో!