టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కెరీర్ పరంగా దూకుడు పెంచుతున్నారు. గత కొన్నేళ్లుగా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె.. ఇప్పుడు మాత్రం వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఓ పక్క తెలుగులో చిత్రాలు చేస్తూనే.. మరోపక్క ఇతర భాషల మూవీల్లోనూ నటిస్తున్నారు. అలాగే వెబ్ సిరీస్‌ల పైనా సమంత ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘ఖుషి’, ‘యశోద’ సినిమాల్లో సమంత నటిస్తున్నారు. ఇందులో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మిగిలిన చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలాఉంటే.. సమంత తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్‌లో కీలకమైన రోల్‌లో సమంత యాక్ట్ చేయనున్నారు.
‘సిటాడెల్’ రీమేక్‌లో సామ్
వరుణ్ ధావన్‌తో కలసి సమంత నటిస్తున్న వెబ్ సిరీస్.. ‘సిటాడెల్’కు రీమేక్‌గా రూపొందుతోంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకద్వయం రూసో బ్రదర్స్ ఇచ్చిన కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ స్క్రిప్టును రెడీ చేసుకున్నారని తెలిసింది. ‘ఫ్యామిలీ మ్యాన్’తో బాగా పాపులారిటీ సంపాదించిన రాజ్, డీకే ద్వయం ఈ సిరీస్‌ను రూపొందిస్తుండటం విశేషం.
సమంత నటించబోతున్న రెండో వెబ్ సిరీస్.. అదే విధంగా ఆమె బాలీవుడ్‌లో చేస్తున్న సెకండ్ ప్రాజెక్టు కూడా ఇదే కానుంది. ఈ సిరీస్‌లో సమంత ‘రా’ ఏజెంట్‌గా కనిపించబోతోందట. యాక్షన్ అడ్వెంచర్‌గా దీన్ని తీయనున్నారట. ఇందులో పోరాట సన్నివేశాలను ప్లాన్ చేశారట రాజ్, డీకే ద్వయం. అందులో సమంత నటించాల్సి ఉందట. దీని కోసమే ప్రస్తుతం అమెరికాలో పలువురు యాక్షన్ నిపుణుల సమక్షంలో సమంత ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఈ వెబ్ సిరీస్ మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
90వ దశకంలో సాగే కథతో..
సమంత నటించనున్న కొత్త వెబ్ సిరీస్ కథ 90వ దశకంలో సాగుతుందని తెలిసింది. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి దీనికి సంబంధించిన వర్క్ షాప్స్‌లో సమంత పాల్గొనబోతున్నారని సమాచారం. ఇండియాలోనే అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్‌గా దీన్ని చెప్పుకుంటున్నారు. మరి ఈ సిరీస్‌తో సమంత ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తారో చూడాలి . కాగా, సమంత నటించిన ‘శాకుంతలం’ (Shakuntalam) సినిమా రిలీజ్ డేట్‌ను ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ముందుగా అనౌన్స్ చేసినట్లు నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయడం లేదని.. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు.
Follow Us