Krithi Shetty: 'ది వారియర్' సక్సెస్ మీట్ లో (The Warrior Success Meet) అదరగొట్టిన కృతి శెట్టి.. ఫొటోలు వైరల్!

Published on Jul 17, 2022 03:03 PM IST

టాలీవుడ్ లో తాను చేసిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది కృతి శెట్టి (Krithi Shetty). బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. ప్రస్తుతం కృతి శెట్టి యంగ్ హీరో రామ్ పోతినేనితో 'ది వారియ‌ర్' సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. 

తమిళ దర్శకుడు లింగుస్వామి (Director Lingu Samy) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో 'ది వారియ‌ర్' సినిమా రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ సినిమా విడుదలయింది. 

కాగా.. 'ది వారియర్' (The Warrior) సినిమా విడుదలైన అన్ని థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ సంబరాలను జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

కృతి శెట్టి సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ నాగార్జున, నాగ చైతన్య ఫ్యామిలీ మల్టీస్టారర్ ‘బంగార్రాజు’లో చైతూ జోడిగా నాగ లక్ష్మి పాత్రలో నటించింది. మరోసారి నాగ చైతన్యతో (Naga Chaitanya) వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

Read More: Krithi Shetty: 'ది వారియర్' (The Warrior) సినిమాలో పక్కింటి అమ్మాయిలా అనిపిస్తాను : కృతి శెట్టి