Anupama Parameswaran: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న అనుప‌మ ప‌ర‌మేశ్వరన్‌ ‘బటర్‌‌ఫ్లై’ సినిమా? త్వరలో ప్రకటన

అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) నటించిన బటర్‌‌ఫ్లై సినిమా థియేటర్లలో లేక ఓటీటీలోనే రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే, యూత్‌ను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు క్రేజీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran). నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్‌' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ భామ.. అదే సంవత్సరం 'అ..ఆ..' సినిమాతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలా కాలంగా గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వస్తున్న అనుపమ.. 'రౌడీ బాయ్స్' సినిమాతో రూట్‌ మార్చారు.

ఇన్నాళ్లూ గ్లామరస్ క్యారెక్టర్లు చేయని అనుపమ.. కొత్త హీరో ఆశిష్‌తో ఏకంగా లిప్ లాక్ సీన్లలో నటించి అభిమానులకు షాకిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ‘అంటే సుందరానికీ’ సినిమాలో మళ్లీ, తన మార్కు ఇన్నోసెంట్ యాక్టింగ్‌ కనబరిచారు అనుపమ. తాజాగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న సినిమా ‘బటర్‌‌ఫ్లై’.

గంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌‌ ఇటీవలే రిలీజైంది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం 'బటర్‌‌ఫ్లై' సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్‌ నెట్‌లో వైరల్ అవుతోంది. 

భారీ ధర ఆఫర్‌‌..

థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన బటర్‌‌ఫ్లై సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రిలీజ్‌ చేయనున్నారని టాక్. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ + హాట్‌ స్టార్‌‌తో చిత్ర యూనిట్ ఇప్పటికే చర్చలు జరిపిందని తెలుస్తోంది.

హాట్‌ స్టార్‌‌ ఇస్తామన్న భారీ ఆఫర్ నచ్చడంతో మేకర్స్ కూడా బటర్‌‌ఫ్లై సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కీలకపాత్రలో నటించిన 'బటర్‌‌ఫ్లై' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేక నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Read More : నా మార్గదర్శిగా ఉన్నందుకు ‘థ్యాంక్యూ’.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఎమోషనల్ పోస్ట్

You May Also Like These