ఆ అవకాశం మిస్సయినప్పుడు ఎంతో బాధపడ్డా.. ‘18 పేజెస్’ (18 Pages) స్వచ్ఛమైన ప్రేమకథ: అనుపమ (Anupama Parameswaran)

18 Pages: మొబైల్, సోషల్ మీడియా లేకుండా ఉండే అమాయకమైన నందిని పాత్ర తన మనసుకు చాలా దగ్గరగా అనిపించిందని అనుపమ (Anupama Parameswaran) అన్నారు

మలయాళ భామలకు టాలీవుడ్‌లో డిమాండ్ ఎక్కువనే చెప్పాలి. అందం, అభినయంతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటీమణుల్లో మలబార్ తీరం వారూ ఉన్నారు. కీర్తి సురేష్, నిత్యా మీనన్ లాంటి ప్రతిభావంతులైన హీరోయిన్లకు మన చిత్రసీమ అగ్రతాంబూలం ఇచ్చింది. వాళ్లు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్టార్లుగా ఎదిగారు. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యువ కథానాయికల్లో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఒకరు. క్యూట్ లుక్స్‌తో యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న అనుమప కూడా కేరళ కుట్టి అనేది తెలిసిందే. ఈ ఏడాది ‘కార్తికేయ 2’ చిత్రంతో ఆమె బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. హిందీలోనూ ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. దీంతో జోష్‌లో ఉన్న అనుపమ ‘18 పేజెస్’ (18 Pages)తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నిఖిల్ సరసన ఆమె యాక్ట్ చేస్తున్న ఈ మూవీని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నారు. శుక్రవారం రిలీజవుతున్న ఈ సినిమా విశేషాలను అనుపమ పంచుకున్నారు. 

‘ప్రేమ లేకుండా ఈ ప్రపంచమే లేదు. భావోద్వేగాలు లేని జీవితమూ ఉండదు. ‘18 పేజెస్’ వంద శాతం స్వచ్ఛమైన ప్రేమకథ. ఈ సినిమా అన్ని వర్గాల వారికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ‘కార్తికేయ 2’కు ముందే ‘18 పేజెస్’కు సైన్ చేశా. ఆ సినిమాలాగే ఇదీ సూపర్ హిట్టవుతుందని ఆశిస్తున్నా. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి. కానీ మొబైల్, సోషల్ మీడియా లేకుండా ఉండే అమాయకమైన నందిని అనే పాత్రలో నటించడం చాలా నచ్చింది’ అని అనుపమ చెప్పుకొచ్చారు. 

డైరెక్షన్ చేయాలనుకుంటున్నా
‘రంగస్థలం’ మూవీ చాన్స్ మిస్సయినప్పుడు చాలా బాధపడ్డానని అనుపమ అన్నారు. అయితే సుకుమార్ రాసిన పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుపమ పేర్కొన్నారు. తాను ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోయాక.. నటనకు కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని, డైరెక్టర్స్ వద్ద టెక్నాలజీ అంశాలపై అవగాహన పెంచుకుని, ఆ తర్వాత డైరెక్షన్ చేస్తానన్నారు. వీలు కుదిరినప్పుడల్లా కథలు రాస్తున్నానని.. అయితే తన సొంత దర్శకత్వంలో తీసే సినిమాలో తాను మాత్రం నటించనని అనుపమ వివరించారు. 

Read more: ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu Song) పాటకు అరుదైన గుర్తింపు.. ఆస్కార్ (Oscar) అవార్డు దక్కేనా?

You May Also Like These