‘రంగస్థలం’లో (Rangasthalam) ముందుగా హీరోయిన్ గా చేయాల్సింది అనుపమ పరమేశ్వరన్ (Anupama).. సుకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

‘18 పేజెస్’ (18 Pages) సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌ (Director Sukumar) కథను అందించగా.. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్‌’ డైరెక్టర్‌ సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించారు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ (Hero Nikhil), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా న‌టించిన తాజా చిత్రం ‘18 పేజెస్’ (18 Pages). ‘కార్తికేయ2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

‘18 పేజెస్’ (18 Pages) సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌ (Director Sukumar) కథను అందించగా.. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్‌’ డైరెక్టర్‌ సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించారు. ఇక, ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇక, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 23న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

ఇందులో భాగంగానే తాజాగా ‘18 పేజెస్’ (18 Pages) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చిన వారందరూ ఈ ప్రాజెక్టులో భాగమైనందున ఈ మూవీ తనకు చాలా ముఖ్యమైందని ఆయన చెప్పారు. సుకుమార్ (Sukumar) లేకపోతే తన సినీ ప్రయాణం ఇలా ఉండేది కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన అంటే తనకు అమితమైన గౌరవం, ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఉంటాయని బన్నీ అన్నారు.

మరోవైపు, ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు సుకుమార్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగ‌స్థ‌లం’ సినిమాలో ఆమె అవ‌కాశం ఎలా పోగొట్టుకుందో వివరించారు. అదంతా ఆయన మాటల్లోనే.. ‘‘రంగస్థలం’ సినిమాలో ముందుగా హీరోయిన్ గా చేయాల్సింది అనుపమ పరమేశ్వరన్. అయితే ఆడీషన్ చేసే సమయంలో ప్రతిసారి వాళ్ళ అమ్మ వైపు చూసేది. సినిమాలోనూ యాక్షన్ అని చెబితే మళ్లీ వాళ్లమ్మ వైపే చూస్తుందని భయమేసింది. అందుకే సమంత ను తీసుకున్నట్లు’ సుకుమార్ తెలిపారు.

అయితే, అప్పుడు తను చిన్నపిల్ల. అలా తనతో సినిమా చేయలేకపోయాను. కానీ, త్వరలోనే అనుపమతో సినిమా తీస్తాను అని కూడా అన్నాడు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ, అనుపమ (Anupama Parameswaran) ఫ్యాన్స్.. ఆమె ఒక మంచి సినిమా మిస్ అయింది అని ఫీల్ అవుతున్నారు. అనపమ గనుక ఆ సినిమా చేసి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదంటున్నారు.

Read More: మిస్టరీ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. భయపెడుతున్న 'బట్టర్‌ ఫ్లై' (Butterfly) ట్రైలర్!

Credits: Pinkvilla
You May Also Like These