సుకుమార్ (Sukumar) లేకపోతే తన సినీ ప్రయాణం ఇలా ఉండేది కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన అంటే తనకు అమితమైన గౌరవం, ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఉంటాయని బన్నీ అన్నారు. గీతా ఆర్ట్స్ 2 – సుకుమార్ రైటింగ్స్ కలసి ‘18 పేజెస్’ (18 Pages) సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చిన వారందరూ ఈ ప్రాజెక్టులో భాగమైనందున ఈ మూవీ తనకు చాలా ముఖ్యమైందని ఆయన చెప్పారు.
బన్నీ వాసుతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ అన్నారు. ‘దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ‘18 పేజెస్’ సినిమాపై నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. ఆయన కష్టం ఫలించాలని కోరుకుంటున్నా. గోపీ సుందర్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో త్వరలో కలసి పని చేయాలని అనుకుంటున్నా. ఈ మూవీకి గోపీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిఖిల్ – అనుపమ ఇద్దరూ కూడా బాగా చేశారు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని ఆశిస్తున్నా’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
ఇది వరకు దక్షిణాది చిత్రాలు ఇక్కడి వరకే పరిమితమయ్యేవని.. కానీ ఇప్పుడు మన సినిమాను ప్రపంచమంతా చూస్తోందని బన్నీ అన్నారు. ఇది మనం గర్వపడాల్సిన విషయమన్నారు. ‘పుష్ప 2’ (Pushpa 2) గురించి కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఈసారి అస్సలు తగ్గేదేలే. ఇది నేను అహంభావంతో చెప్పే మాటకాదు. ఎంతో ఇష్టంతో, నమ్మకంతో చెబుతున్నా. ఈ మూవీ మీ మనసుకు నచ్చాలని.. నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని బన్నీ అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ.. సుకుమార్ రాసిన కథలో.. సిద్ధు అనే మంచి పాత్ర చేయడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు, జెమిని కిరణ్, గోపీ సుందర్, రవికుమార్, సరయు, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Read more: Telugu Biggboss: బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తపుకుంటున్న నాగార్జున (Nagarjuna).. కొత్త హోస్ట్ ఎవరంటే?
Follow Us