Ritu Varma: కుర్రాళ్లకు చీరలో అందాల విందు పంచుతున్న 'పెళ్లి చూపులు' (Pelli Chupulu) బ్యూటీ రీతూవర్మ..!

Published on Aug 02, 2022 06:07 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లలో ఒకరు రీతూ వర్మ (Ritu Varma). ఈ బ్యూటీ 'పెళ్లి చూపులు' (Pelli chupulu Movie) సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రీతూకు తెలుగులో రావాల్సిన గుర్తింపు గానీ అవకాశాలు కానీ రాలేదు. 

సినిమాల ద్వారా తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రీతూ వర్మ (Ritu Varma) సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. 

ఇటీవల ‘వరుడు కావలెను’ (Varudu Kavalenu Movie) సినిమాలో బాస్ లేడీగా నటించి సత్తా చాటింది రీతూ వర్మ. ఆ తర్వాత తెలుగులో ‘కణం’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగుతో పాటు, తమిళంలోనూ రూపొందుతోంది ఈ సినిమా. అలాగే, తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన రీతూవర్మ ‘ధృవ నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తోంది. 

రీతూవర్మకి (Ritu Varma) తెలుగమ్మాయి అనే ట్యాగ్ ఉన్నప్పటికీ, గ్లామర్ విషయంలోనూ పెద్దగా హద్దులు పెట్టుకోలేదు. ఆ అంశమే ఈ బ్యూటీకి అవకాశాలు రావడానికి అనుకూలంగా ఉందేమో బహుశా. 

తాజాగా హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోయింది రీతూ వర్మ (Ritu Varma Hot Photoshoot). చీరలో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. ఇందులో రీతూ వర్మ.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించింది. థిక్‌ గ్రీన్‌ కలర్‌ శారీలో యమ హాట్‌గా ఉంది. అంతేకాదు విరహంతో కూడిన పోజులిస్తూ నెటిజన్లకి చుక్కలు చూపిస్తోంది. ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు.  

Read More: 'పెళ్లి చూపులు' మూవీ (Pelli chupulu) బ్యూటీ రీతూ వర్మ అదిరిపోయే ఫొటోలు..!