రక్తదానం చేయండి.. ఆపన్నుల ప్రాణాలు కాపాడండి : రామ్ చరణ్ (Ram Charan)

Published on Apr 26, 2022 07:52 PM IST

చిరంజీవి బ్లడ్ బ్యాంకు (Chiranjeevi Blood Bank) అనే సంస్థ గత 24 ఏళ్లు సేవా తత్పరతతో పనిచేస్తోందని, దాదాపు ఇప్పటి వరకు 3.30 లక్షలమంది అభిమానులు ఈ బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానం చేశారని సినీ నటుడు రామ్ చరణ్ (Ram Charan) తెలిపారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఆయన మాట్లాడారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులను అభినందించారు.

“ఫెట్‌ ద మేళా” అనే పేరుతో నిర్వహించిన ఈ క్యాంపును ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ హరిప్రీత్‌ సింగ్‌ ప్రారంభించారు.