ఆచార్య (Acharya) : అభిమానిని సున్నితంగా మందలించిన చెర్రీ

Published on Apr 26, 2022 08:13 PM IST

ఆచార్య.. ప్రస్తుతం మెగా అభిమానులందరూ ఎదురు చూస్తోంది ఈ సినిమా కోసమే. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడారు. తన తండ్రితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే క్రమంలో ఓ అభిమాని వచ్చి, అతని కాళ్ళ మీద పడగా "ఎవరు సెట్ చేశారు తమ్ముడూ" అని సున్నితంగా మందలించి, సభలో నవ్వులు పూయించారు. ఈ సభకు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

కొరటాల శివ దర్శకత్వంలో నిర్మితమైన ఆచార్య సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ మొత్తమే దాదాపు రూ.140 కోట్లు ఉంటుందని వినికిడి. నిజాం రైట్స్ ఒక్కటే దాదాపు రూ. 43 కోట్లకు అమ్ముడైంది.