తెలుగు చిత్ర పరిశ్రమ కాలర్ ఎగరేసుకునే రోజులు వచ్చాయని కథానాయకుడు సందీప్ కిషన్ (Sundeep Kishan) అన్నారు. ఆయన నటించిన ‘మైఖేల్’ (Michael) సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ఇదే తన చివరి సినిమా అనుకుని పని చేశానన్నారు. జీవితంలో ఏది సరైనది, ఏది తప్పనేది చాలా మంది చెబుతుంటారని.. కానీ మన సత్తా ఎంతనే దానిపై మనకో క్లారిటీ ఉండాలని సందీప్ కిషన్ చెప్పారు. మనల్ని మనం ఏ స్థాయిలో చూసుకోవచ్చు, ఎక్కడి వరకు వెళ్లొచ్చనే విషయంలో ఒక అంచనా ఉండాలని పేర్కొన్నారు. అలా తనకు తాను పెట్టుకున్న పరీక్షే ‘మైఖేల్’ అని సందీప్ తెలిపారు.
‘మైఖేల్ సినిమా కోసం ఎంత కష్టమైనా పడాలని నిర్ణయించుకున్నా. పాత్రకు తగినట్లుగా కనిపించడం కోసం 24 కిలోలు బరువు తగ్గాను. ఒక రిస్కీ షాట్‌ను ఎలా చేయాలో నాకు చూపించడం కోసం నేను లొకేషన్‌కు వెళ్లేలోగా రెండుసార్లు చేసేసి రికార్డు చేసిన దర్శకుడు రంజిత్ జయకోడి. ఇలాంటి డైరెక్టర్ దొరకడం నా అదృష్టం. ‘మైఖేల్’ మూవీ రిలీజ్ అయ్యేలోగా ఆయన మూడు చిత్రాలకు సైన్ చేయడం నాకు ఆనందాన్ని కలిగించే విషయం. విజయ్ సేతుపతి వంటి నటుడితో కలసి నటించడం నాకు లభించిన వరంగా భావిస్తున్నాను’ అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.
ఇక, సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మైఖేల్’ను రంజిత్ జయకోడి అనే దర్శకుడు తెరకెక్కించారు. ‘గల్లీరౌడీ’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని.. ‘మైఖేల్’గా సందీప్ కిషన్ ముందుకొస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాను భారీగా తెరకెక్కించారు.
‘మైఖేల్’లో సందీప్ కిషన్ సరసన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పాటు వరుణ్ సందేష్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘మైఖేల్’ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. డైలాగులు కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మరి, ఈ చిత్రంతోనైనా సందీప్ కిషన్ కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి.
Read more: ధనుష్ (Dhanush)‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలోని కీలక పాత్రలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్?
Follow Us