Karthikeya 2: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'కార్తికేయ 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లను వసూళ్లు చేసింది. సౌత్‌తో పాటు నార్త్ ఇండియాలోనూ ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తాజాగా 'కార్తికేయ 2' సక్సెస్ మీట్ సంబురాలను కర్నూలులో జరిపారు. ఈ వేడుకలో నిఖిల్ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. సినిమా హిందీ వర్షన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లను రాబట్టింది.
రోజు రోజుకు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ పోతూ.. 'కార్తికేయ 2' కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ సినిమా వంద కోట్ల రూపాయల మార్క్‌ను దాటడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఏపీలోని కర్నూలులో 'కార్తికేయ 2' సక్సెస్ సంబురాలలో హీరో నిఖిల్‌తో పాటు దర్శకుడు, సాంకేతిక వర్గం కూడా పాల్గొన్నారు.
ప్రేక్షకులకు థ్యాంక్యూ : చిత్ర యూనిట్
అభిమానులు, ప్రేక్షకులు 'కార్తికేయ 2' (Karthikeya 2) సినిమాను ప్రమోట్ చేశారని హీరో నిఖిల్ అన్నారు. తెలుగు సినిమా 'కార్తికేయ 2' ను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించారని చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
హిందీలో కూడా తెలుగువాళ్ళ సినిమా 'కార్తికేయ 2' బ్రహ్మాండంగా ఆడుతుంటే గర్వంగా ఉందన్నారు. దాదాపు 1200 వందల స్క్రీన్లలో 'కార్తికేయ 2' ప్రదర్శితమవుతోందన్నారు. చిత్ర యూనిట్‌తో పాటు ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు నిఖిల్.
ఈ సినిమా ద్వారా నిఖిల్ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడని దర్శకుడు చందు మొండేటి తెలిపారు. 'కార్తికేయ 2' చిత్రాన్ని ఇంతటి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.
ద్వారక నగర రహస్యాలు తెలిపే సినిమా
కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నాక, ద్వారక నగరంలో కొన్ని అద్భుత రహస్యాలను చేధించే ఓ యువకుడి సాహస గాథే ఈ సినిమా. 'పుష్ప' తర్వాత ఆ రేంజ్‌లో 'కార్తికేయ 2' సినిమాకు నార్త్‌లో డిమాండ్ ఏర్పడింది. నిఖిల్‌కు జోడిగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించారు.
ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ధన్వంతరి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ నటించి మెప్పించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
Follow Us