యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) పెళ్లిపై వస్తున్న రూమర్లు నిజమా?.. కాదా?

కన్నడ భామ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్లు వస్తున్నాయి

కన్నడ నటి వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించారు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్‌లో ఆమె తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్నారు. ‘చూసి చూడంగానే’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన వర్ష.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తనదైన నటనతో ఆమె ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. ఈ చిత్రంతో ఆమెకు వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. 

తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ సరసన ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam) మూవీలో వర్ష బొల్లమ్మ నటించారు. దసరా పండుగకు విడుదలైన ఈ సినిమా.. ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె తదుపరి చేయబోయే సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ విషయాన్ని అటుంచితే.. వర్ష పెళ్లి గురించిన వార్తలు టాలీవుడ్‌లో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 

వర్ష బొల్లమ్మపై సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి కుమారుడు మనసు పారేసుకున్నారట. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించారట.  అంతేకాదు ఇప్పటికే నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో ఎంగేజ్‌మెంట్, పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. వీటిల్లో నిజమెంతో ఇంకా తెలియరాలేదు. ఈ వార్తలపై వర్ష బొల్లమ్మ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.   

Read more: మూడు వారాల్లో రిలీజ్ చేస్తే సాలిడ్ రేట్!.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veeraiya)కు ఓటీటీ సంస్థ భారీ ఆఫర్?

You May Also Like These