Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన ఆమె మేనేజర్

సమంత (Samantha Ruth Prabhu) ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ మీడియాతోపాటు తమిళ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి

సౌతిండియాతోపాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు సమంత (Samantha Ruth Prabhu). తొలుత టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ పాగా వేశారు. ఇక ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించడంలో సక్సెస్ అయ్యారు సామ్. దీంతో ఈ మూడు ఇండస్ట్రీల నుంచి ఆమెకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. అయితే సమంత మాత్రం సెలెక్టివ్‌గా ముందుకెళ్తున్నారు. 

ఈ మధ్య సినిమాలు తగ్గించిన సామ్.. ఇప్పుడు మళ్లీ జోరు పెంచారు. రీసెంట్‌గా ‘యశోద’ (Yashoda) చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఈ భామ.. తర్వాత ఏయే సినిమాలతో పలకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. సామ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయంలో తెలిసిందే. ‘మయోసైటిస్’ అనే రుగ్మతతో బాధపడుతున్న సామ్ ఆరోగ్యం మెళ్లిగా కోలుకుంటున్నారు. 

ఇలాంటి తరుణంలో సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ మీడియాతోపాటు తమిళ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారని న్యూస్ రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని కమ్‌బ్యాక్ ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, సమంతకు ఏమీ కాలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 

సమంత ఆరోగ్యం మీద మళ్లీ వార్తలు వస్తుండటంపై ఆమె మేనేజర్ స్పందించారు. సామ్ ఆస్పత్రిలో చేరిందనేది పుకారేనని సామ్ మేనేజర్ కొట్టిపారేశారు. ఆమె ఇంటి వద్దనే క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. ఇకపోతే, ప్రస్తుతం సమంత (Samantha) సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్‌ ఎంటర్‌‌లైనర్‌‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీతోపాటు సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’లోనూ సామ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. 

Read more: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)కు ఇష్టమైనవి ఏంటో తెలుసా? (డార్లింగ్‌ గురించిన టాప్‌7 ఆసక్తికర విశేషాలు)

You May Also Like These