ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీ మీద, అక్కడ రిలీజ్ అవుతున్న చిత్రాల మీద జనాలు ఎంతటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ ని, సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్ (Boycott on Bollywood) చేస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండాల్సింది పోయి అక్కర్లేని కామెంట్స్ చేస్తూ ఈ వివాదంలో ఇరుక్కుంటున్నారు బాలీవుడ్ యాక్టర్స్.
ఇప్పటికే ఈ అంశంపై కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్, కరీనా కపూర్, హృతిక్ రోషన్ (Hrithik Roshan) లను కూడా బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ లిస్ట్ లోకి అలియా భట్ (Alia Bhatt) కూడా చేరింది.
ప్రస్తుతం అలియా,రణ్ బీర్ కపూర్ కలిసి 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) అనే సినిమాతో రాబోతోన్నారు. కానీ స్టార్ కిడ్స్ నటించిన చిత్రమంటూ ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తున్నారు జనాలు. దీనిపై అలియా భట్ అసహనం వ్యక్తం చేసింది. ఎప్పుడూ అదే కామెంట్లా? నేను ఇంకా స్టార్ కిడ్‌ని అనే అంటారా? నేను నచ్చితే చూడండి లేకపోతే లేదు.. నేను ఏంటో నిరూపించుకుంటాను.. నా స్థాయికి తగ్గ నటిగా నేను నిరూపించుకుంటాను.. అని ఇలా కాస్త పరుషంగా మాట్లాడేసింది అలియా భట్.
‘నేను ఎవరి అవకాశాలనూ లాక్కోవడంలేదు. నా వద్దకు వచ్చిన సినిమాలు మాత్రమే నేను చేస్తున్నాను. అయినా, సినిమా రంగంలో నా కుటుంబ సభ్యులు ఉంటే అది నా తప్పు కాదు. వారి కడుపున పుట్టడం తప్పెలా అవుతుంది.? నాకు ఇష్టమైన రంగమిది. మీకు నచ్చకపోతే, నా సినిమాలు చూడొద్దు..’ అంటూ గుస్సా అయ్యింది అలియా భట్ (Alia Bhatt). ఈ నేపథ్యంలో అలియా భట్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ‘ఇక నుంచి అలియా భట్ సినిమాలు ఎవరూ చూడొద్దు..’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ (Trolling on Alia Bhatt) చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో అమిర్ ఖాన్ (Aamir Khan) చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు 'లాల్ సింగ్ చడ్డా' ద్వారా జనాలు ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయండని పిలుపునిచ్చారు. దీంతో సినిమా కూడా బాగా లేకపోవడంతో.. దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. 'చూస్తే చూడండి లేకపోతే లేదు.. మిమ్మల్ని మేం బలవంతం చేయడం లేదు కదా?' అని గతంలో కరీనా కపూర్ (Kareena Kapoor) అన్న మాటలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నట్టు అయింది.
Read More: Alia Bhatt: బాలీవుడ్ (Bollywood) సినిమాల పట్ల మీడియా సానుభూతితో వ్యవహరించాలి : అలియా భట్!
Follow Us