Pushpa: రష్యాలో ‘పుష్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్‌లో సందడి చేయనున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్!

Pushpa in russia: రష్యాలో పుష్పరాజ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. గతేడాది డిసెంబర్‌లో భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమా.. ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ మూవీ సాధించిన విక్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీ ఆడియెన్స్ విశేషంగా ఆదరించడంతో బాలీవుడ్‌లో ‘పుష్ప’ (Pushpa) రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించింది. 

‘పుష్ప’ చిత్రం మొత్తంగా రూ.360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఊహించని విధంగా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని రష్యన్ భాషలో రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో ‘పుష్ప’ను రష్యా (PushpaInRussia)లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

రష్యాలో డిసెంబర్ 8న ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీమియర్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యాకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1వ తేదీన మాస్కో, 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పుష్పరాజ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి, భారత్‌లో సంచలనాలు సృష్టించిన ‘పుష్ప’ చిత్రం రష్యన్ సినీ అభిమానులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

ఇకపోతే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా మేకర్స్ వెనుకాడటం లేదని తెలుస్తోంది. సౌత్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ‘పుష్ప’ సీక్వెల్‌పై భారీ క్రేజ్ నెలకొంది. కాబట్టి పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడం అంత కష్టం కాకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. 

Read more: "కృతి సనన్ (Kriti Sanon) మనసులో ఉన్న హీరో దీపికా పదుకొణెతో (Deepika Padukone) బిజీగా ఉన్నాడు": వరుణ్ ధావన్!

You May Also Like These